Shraddha Srinath is heroine for Venkatesh in Saindhav
Saindhav : విక్టరీ వెంకటేష్ (Venkatesh) ప్రస్తుతం ‘సైంధవ్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రం వెంకటేష్ 75వ రాబోతుంది. ఈ మైల్ స్టోన్ మూవీకి యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు. హిట్ వంటి క్రైమ్ థ్రిల్లర్స్ తో ఆకట్టుకున్న శైలేష్.. ఇప్పుడు సైంధవ్ చిత్రాన్ని కూడా అదే తరహాలోనే తెరకెక్కిస్తున్నాడు. సినిమా అనౌన్స్ చేస్తూనే రిలీజ్ చేసిన గ్లింప్స్ ఆడియన్స్ లో మూవీ పై బజ్ ని క్రియేట్ చేసింది. ఇక ఒక పక్క చిత్రీకరణ జరుపుకుంటూనే మరో పక్క వరుస అప్డేట్ లు ఇస్తూ సినిమాని ప్రేక్షకులకు దగ్గర చేసేలా చేస్తున్నారు.
SSMB28 : షూటింగ్ సెట్ నుంచి మహేష్, పూజా పిక్ లీక్.. వైరల్!
ఈ క్రమంలోనే ఇటీవల షూటింగ్ ప్రోగ్రెస్ తెలుపుతూ ఒక పోస్ట్ వేశారు. హైదరాబాద్ లో మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 13 నుంచి వైజాగ్ లో సెకండ్ షెడ్యూల్ మొదలు పెట్టుకుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రద్ధ శ్రీనాధ్ (Shraddha Srinath) నటించబోతుంది. శ్రద్ధ ఈ మూవీలో ‘మనోజ్ఞ’ అనే పాత్రలో కనిపించబోతుంది. ఆ పాత్రని పరిచయం చేస్తూ చిత్ర యూనిట్ శ్రద్ధ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. చీరలో మిడిల్ క్లాస్ మహిళగా కనిపిస్తున్న శ్రద్ధ లుక్స్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నాయి.
కాగా ఈ సినిమా కథ ఒక మెడికల్ డ్రగ్ చుట్టూ తిరుగుతుందని తెలుస్తుంది. వెంకటేష్ కూడా మెషిన్ గన్స్ పట్టుకొని రఫ్ లుక్ లో కనిపిస్తున్నాడు. శైలేష్ కొలను ఈ చిత్రాన్ని పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు. దీంతో ఈ చిత్రం కోసం వెంకీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సంతోష్ నారాయణ సంగీతం అందిస్తుండగా నిహారిక ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్నాడు.
Shraddha Srinath is heroine for Venkatesh in Saindhav