Shruthi Haasan : చలిలో చీరతో డ్యాన్స్ చేయడం చాలా కష్టం.. కానీ తప్పలేదు..

ఈ సినిమాలో నువ్వు శ్రీదేవి అయితే.. ఆ అయితే.. నేనే చిరంజీవి అవుతా.. అంటూ సాగే ఓ సాంగ్ ఇటీవల రిలీజయి ప్రేక్షకులని మెప్పించింది. అయితే ఈ పాటని ఫ్రాన్స్ సరిహద్దుల్లో మైనస్ డిగ్రీలలో మంచులో, ఫుల్ చలిలో తీశారు. ఇప్పటికే ఈ పాట గురించి.............

Shruthi Haasan : చలిలో చీరతో డ్యాన్స్ చేయడం చాలా కష్టం.. కానీ తప్పలేదు..

shruthi haasan says about waltair veerayya song shoot problems

Shruthi Haasan :  మెగాస్టార్ హీరోగా, శృతి హాసన్ హీరోయిన్ గా డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా వాల్తేరు వీరయ్య. రవితేజ ఇందులో ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాని జనవరి 13న సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్, గ్లింప్స్ తో సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో నువ్వు శ్రీదేవి అయితే.. ఆ అయితే.. నేనే చిరంజీవి అవుతా.. అంటూ సాగే ఓ సాంగ్ ఇటీవల రిలీజయి ప్రేక్షకులని మెప్పించింది. అయితే ఈ పాటని ఫ్రాన్స్ సరిహద్దుల్లో మైనస్ డిగ్రీలలో మంచులో, ఫుల్ చలిలో తీశారు. ఇప్పటికే ఈ పాట గురించి చిరంజీవి, శేఖర్ మాస్టర్ పంచుకున్నారు. అక్కడ మైనస్ డిగ్రీల చలిలో డ్యాన్స్, షూట్ చాలా కష్టం అయిందని.

Chiranjeevi : వాల్తేరు వీరయ్య చిత్ర యూనిట్ కి స్పెషల్ న్యూ ఇయర్ పార్టీ ఇచ్చిన మెగాస్టార్..

ఇక ఆ పాటలో శ్రుతిహాసన్ చీర కట్టుకొని డ్యాన్స్ చేసింది. చీరలో వెనక మంచు పడుతుంటే శృతి హాసన్ డ్యాన్స్ చేస్తుంటే చాలా బాగుంది. ఆ విజువల్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. తాజాగా ఈ సాంగ్ పై శ్రుతిహాసన్ మాట్లాడుతూ.. అసలు నేను మంచులో పాటకి చీరతో డ్యాన్స్ వేస్తాను అనుకోలేదు. ఆ వాతావరణం నాకు చాలా అసౌకర్యంగా అనిపించింది. చాలా కష్టంగా ఉంది. కానీ తప్పదుగా ప్రేక్షకులకి నచ్చడానికి మేము చాలా కష్టాలు పడాలి. ఆ మైనస్ డిగ్రీల చలిలో చాలా ఇబ్బందులు పడుతూ డ్యాన్స్ చేశాం. చాలా కష్టంగా షూట్ పూర్తి చేశాం. ఏం చేసినా ప్రేక్షకుల కోసమే మా కష్టాలు అన్ని అని తెలిపింది.