Chiranjeevi : వాల్తేరు వీరయ్య చిత్ర యూనిట్ కి స్పెషల్ న్యూ ఇయర్ పార్టీ ఇచ్చిన మెగాస్టార్..
తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి చిత్ర యూనిట్ కి తన ఇంట్లో స్పెషల్ పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి రవితేజ, డైరెక్టర్ గోపీచంద్, నిర్మాతలు, శేఖర్ మాస్టర్, రామ్ లక్ష్మణ్, వెన్నెల కిషోర్, షకలక శంకర్, సప్తగిరి, శ్రీనివాస రెడ్డి.. ఇలా సినిమాలో నటించిన వారితో పాటు సినిమాకి పని చేసిన........

Chiranjeevi gives new year party to waltair veerayya movie unit
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నారు. గత సంవత్సరం దసరాకి గాడ్ ఫాదర్ సినిమాతో వచ్చి మంచి విజయం సాధించారు చిరంజీవి. ఈ సారి సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమాతో రాబోతున్నారు. చిరంజీవి హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ గ్రాండ్ గా నిర్మిస్తుంది. ఇందులో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా రవితేజ ముఖ్య పాత్రలో చేయడం విశేషం.
ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజయిన పాటలకి మంచి స్పందన వస్తుంది. వాల్తేరు వీరయ్య సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ఈ సారి సంక్రాంతికి ఫుల్ జోష్ ఉండబోతుందని మెగా అభిమానులు సంతోషంగా ఉన్నారు. ఈ సారి రవితేజ, చిరంజీవి కలిసి తెరపై సందడి చేస్తుండటంతో మెగా మాస్ హిట్ పక్కా అని అంటున్నారు. ఇప్పటికే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తయి ప్రమోషన్స్ చేస్తున్నారు చిత్ర యూనిట్.
Anchor Suma : సుమ అడ్డా ఎంటర్టైన్మెంట్ గడ్డ.. యాంకరింగ్‌కి బ్రేక్ ఇచ్చేదేలే అంటున్న సుమ..
తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి చిత్ర యూనిట్ కి తన ఇంట్లో స్పెషల్ పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి రవితేజ, డైరెక్టర్ గోపీచంద్, నిర్మాతలు, శేఖర్ మాస్టర్, రామ్ లక్ష్మణ్, వెన్నెల కిషోర్, షకలక శంకర్, సప్తగిరి, శ్రీనివాస రెడ్డి.. ఇలా సినిమాలో నటించిన వారితో పాటు సినిమాకి పని చేసిన టెక్నీషియన్స్ కూడా వచ్చారు. వీరందరికి చిరంజీవి మంచి పార్టీ ఇచ్చాడని సమాచారం. దీంతో న్యూ ఇయర్ రోజు మెగాస్టార్ పార్టీ ఇచ్చాడని చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అనంతరం అందరూ కలిసి దిగిన గ్రూప్ ఫోటో ఒకటి వైరల్ గా మారింది.
Mega ⭐ @KChiruTweets threw a NEW YEAR party to the entire team of #WaltairVeerayya ?❤️?
The team is all smiles & super confident about the film which is hitting screens on January 13th ?? @RaviTeja_offl @dirbobby @shrutihaasan @ThisIsDSP @MythriOfficial @SonyMusicSouth pic.twitter.com/MX8YtAHFgo
— BA Raju's Team (@baraju_SuperHit) January 2, 2023