Shruti Haasan : పెళ్ళికి ముందే బాయ్ ఫ్రెండ్‌తో కలిసి.. ట్రెడిషినల్‌గా శృతి హాసన్ దీపావళి సెలెబ్రేషన్స్..

తాజాగా దీపావళి సందర్భంగా శృతి తన బాయ్ ఫ్రెండ్ శంతనుతో కలిసి గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది.

Shruti Haasan Celebrated Diwali with her Boy Friend Shantanu Hazarika Photos Goes Viral

Shruti Haasan : హీరోయిన్ శృతి హాసన్.. డూడుల్ ఆర్టిస్ట్ శంతను హజారికా(Santanu Hazarika)తో గత కొన్నేళ్లుగా రిలేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే. గతంలో మైకెల్ తో బ్రేకప్ అయ్యాక.. బాగా డిస్టర్బ్ అయిన శృతి ఆ తర్వాత శంతనుతో డేటింగ్ చేస్తుంది. వీళ్ళ లవ్ గురించి ఎప్పుడో బహిరంగంగానే చెప్పేసింది. ఇద్దరూ ముంబైలో కలిసే నివసిస్తున్నారంటూ వార్తలు కూడా వచ్చాయి. రెగ్యులర్ గా శృతి తన బాయ్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.

Also Read : Varun Lavanya : పెళ్లి తర్వాత వరుణ్ లావణ్య ఫస్ట్ దీపావళి.. అత్తారింట్లో లావణ్య ఎలా సెలబ్రేట్ చేసుకుందో చూడండి..

తాజాగా దీపావళి సందర్భంగా శృతి తన బాయ్ ఫ్రెండ్ శంతనుతో కలిసి గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది. ఎప్పుడూ హాట్ మోడరన్ డ్రెస్సుల్లో కనిపించే శృతి హాసన్ దీపావళి రోజు పద్దతిగా పట్టుచీర కట్టుకుంది. తన బాయ్ ఫ్రెండ్ శంతను కూడా పద్దతిగా పట్టుపంచె కట్టాడు. వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది శృతి. దీంతో వీరి ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. అయితే పెళ్లి కాకుండానే ఇద్దరూ కలిసి నివసిస్తూ, ఇలా పండగలు సెలబ్రేట్ చేసుకుంటూ మరింత వైరల్ అవుతున్నారు ఈ జంట.