Shruti Haasan
Shruti Haasan shares pic: శ్రుతిహాసన్ (Shruti Haasan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. లోకనాయకుడు కమల్‌హాసన్ కూతురిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టినా తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటిస్తూ అగ్రకథానాయికగా కొనసాగుతోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అతి కొద్ది మంది హీరోయిన్స్‌లలో శ్రుతిహాసన్ ఒకరు. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతో పాటు సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా తన సోషల్ మీడియాలో ఆస్క్ మీ ఎనీథింగ్ అనే సెషన్‌ను నిర్వహించింది.
సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ఇలాంటి సెషన్స్ నిర్వహించినప్పుడు కొందరు ఆకతాయిలు ఇదే ఛాన్స్ అంటూ పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడుగుతుంటారు. హద్దులు మీరుతుంటారు. ఇక శ్రుతి హాసన్ కు కూడా ఓ ఆకతాయి హద్దులు దాటేసీ మరీ ఓ ప్రశ్న అడిగాడు. ఇందుకు శ్రుతి హాసన్ కూడా తనదైన శైలిలో సదరు నెటీజన్‌కు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం వీరి సంబాషణకు సంబంధించిన స్క్రీన్ షాట్లు నెట్టింట వైరల్‌గా మారాయి.
Dil Raju : పదవి చేపట్టడంతోనే సమస్యల పై దృష్టి పెట్టిన దిల్ రాజు.. తెలుగు సినీ పరిశ్రమ..!
చిన్నప్పటి ఫోటో పెట్టమని ఒకరు, రెడ్ డ్రెస్సులో ఉన్న ఫోటో కావాలని ఇంకొకరు, తన బాయ్ ఫ్రెండ్‌తో ఉన్న ఫోటో పోస్ట్ చేయమని మరొకరు ఇలా ఒక్కొక్కరు ఒక్కొ ప్రశ్న అడిగారు. అయితే.. ఓ నెటీజన్ మాత్రం శ్రుతిహాసన్ పాదాల ఫోటో పెట్టమని అడిగాడు. అతడికి బుద్ధి వచ్చేలా.. ఏదో ఒక ఏలియన్‌ను పోలిన పాదాల ఫోటోను పోస్ట్ చేసింది శ్రుతి హాసన్. ఈ పిక్ చూసిన సదరు నెటీజన్ దిమ్మతిరిగిపోవడం ఖాయం.
Shruti Haasan shares a funny feet pic
ఇక తాను ఇంట్లో ఖాళీగా ఉన్నసమయాల్లో ప్రశాంతత కోసం గార్డెనింగ్ చేస్తానని, మొక్కలకు నీళ్లు పోస్తూ ఉంటాను అని మరో ఫోటో ద్వారా చెప్పింది. ఈ ఏడాది శ్రుతిహాసన్ ‘వీరసింహారెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’ చిత్రాలతో రెండు బ్లాక్ బాస్టర్ హిట్లు అందుకుంది. ప్రస్తుతం ఆమె ప్రభాస్ సరసన ‘సలార్’లో నటిస్తోంది.
Bro Movie : వారాహి యాత్ర కాదు బ్రో యాత్ర షురూ.. ఆగష్టు నుంచి స్టార్ట్..