Shruti Haasan : సేల్స్ గర్ల్‌గా పని చేయాలని అనుకున్నా.. కానీ నటిని అయ్యాను..

శృతిహాసన్ తాజాగా సోషల్ మీడియా అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యింది. ఈ ఇంటరాక్షన్ లో..

Shruti Haasan wants to be a sales girl in her childhood

Shruti Haasan : సౌత్ స్టార్ హీరోయిన్ శృతిహాసన్.. తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యింది. ఈ ఇంటరాక్షన్ లో నెటిజెన్స్ అడిగిన ప్రశ్నలకు శృతిహాసన్ బదులిస్తూ వచ్చింది. ఈక్రమంలోనే శృతిహాసన్ ఏడుస్తుందా..? అని ఒక నెటిజెన్ క్వశ్చన్ చేయగా, దానికి ఆమె బదులిస్తూ.. “నేను చాలా సున్నితమైన మనిషిని. చాలా విషయాలకు ఏడుస్తూంటాను. కానీ అందరి ముందు ఏడవడం ఇష్టం ఉండదు” అంటూ చెప్పుకొచ్చింది.

Suriya 43 : సూర్య, సుధా కొంగర సినిమాలో నజ్రియా నజీమ్..?

‘చిన్నతనంలో మీరు ఎలాంటి జాబ్ చేయాలని అనుకున్నారు’ అనే ప్రశ్నని వేయగా శృతి బదులిస్తూ.. ‘బట్టల షాప్‌లో సేల్స్ గర్ల్‌గా చేయాలని అనుకున్నాను. చిన్నప్పుడు నా ఆలోచనలు అన్ని ఇలానే ఉండేవి. షాప్ కి వచ్చిన కస్టమర్లతో సరదాగా ముచ్చటలు పెట్టాలని’ అనుకునేదట. ఈ జవాబు విన్న నెటిజెన్స్ కి దిమ్మతిరిగింది. ఇండస్ట్రీలో ఆల్ రౌండర్ గా గుర్తింపు సంపాదించుకున్న శృతి.. సేల్స్ గర్ల్‌గా చేయాలనుకుందా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Navdeep : డ్రగ్స్ కేసులో నవదీప్..! తాను కాదంటున్న టాలీవుడ్ హీరో నవదీప్

ఇక మరో నెటిజెన్ శృతి లవర్ శంతను గురించి ప్రశ్నించగా, ఆమె బదులిస్తూ.. శంతను చేసే ఆర్ట్ వర్క్ నచ్చి తనని ఇన్‌స్టాగ్రామ్ లో ఫాలో అవుతూ వచ్చిందట. ఆ తరువాత మెసేజ్ లు, ప్రేమ వరకు వెళ్లిందట. ఇన్‌స్టాలోనే తమ ప్రేమ పుట్టినట్లు వెల్లడించింది. ఇక పెళ్లి ఎప్పుడు అని ప్రశ్నించగా.. ‘బోరింగ్’ అంటూ బదులిచ్చింది.

Baby Movie : బేబీ సినిమాపై సీపీ ఆగ్రహం.. స్పదించిన దర్శకుడు సాయి రాజేష్..

మరో నెటిజెన్.. మీకు టాటూలు అంటే ఎందుకు అంత ఇష్టమని ప్రశ్నించాడు. దానికి శృతి బదులిస్తూ.. “ఆ టాటూలంటే పిచ్చి అంతే. 19 ఏళ్ళ వయసులో మొదటి టాటూ వేసుకున్నాను. ఒకవేళ నటిని కాకపోతే ఒక్క మొఖం మీద కాకుండా ఒంటినిండా టాటూలు వేయించేసుకునేదని” అంటూ వెల్లడించింది. ప్రస్తుతం శృతిహాసన్ సమాధానాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.