Prabhas : ప్రభాస్ పెళ్లికి టైం ఫిక్స్ చేసుకున్నాము.. పెద్దమ్మ శ్యామలాదేవి ఇంట్రస్టింగ్ కామెంట్స్..

రెబెల్ స్టార్ ప్రభాస్ పెళ్లెప్పుడు? ఎవరిని చేసుకుంటారు? ఎప్పుడు చేసుకుంటారు? అభిమానులను చిరకాలంగా వేధిస్తున్న ప్రశ్న. ప్రభాస్ పెద్దమ్మ పెళ్లిపై క్లారిటీ ఇచ్చారు.. ఆ .. ప్రకారం ప్రభాస్ త్వరలో గుడ్ న్యూస్ చెప్తున్నారా?

Prabhas

Prabhas : టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ ఎవరూ అంటే ఠక్కున ప్రభాస్ అంటారు. ఈశ్వర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి పాన్ ఇండియా హీరోగా ఎదిగిన ప్రభాస్ భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. మరి పెళ్లెప్పుడు? అనేది మాత్రం ఫ్యాన్స్‌కి పెద్ద ప్రశ్నగానే ఉండిపోయింది. ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి ప్రభాస్ పెళ్లి గురించి ఆసక్తికరమైన విషయం చెప్పారు.

Prabhas : మారుతి సినిమా నుంచి ప్రభాస్ కొత్త ఫోటోలు లీక్.. వింటేజ్ లుక్‌లోకి వచ్చేశాడుగా..

ప్రభాస్ ‘ఆదిపురుష్’ తర్వాత నాలుగు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. సినిమాలతో ఫ్యాన్స్‌కి పండగ చేస్తున్నా పెళ్లెప్పుడో మాత్రం ప్రభాస్ అభిమానులకు క్లారిటీ లేదు. అనుష్కతో పెళ్లంటూ చాలాకాలం పుకార్లు నడిచాయి. ఆదిపురుష్ సినిమా సమయంలో కృతిసనన్‌తో ప్రభాస్ ప్రేమలో పడ్డారని కూడా చెప్పుకున్నారు. అలాంటిదేమీ లేదని కృతిసనన్ క్లారిటీ ఇచ్చింది. ఈ రూమర్లు పక్కన పెడితే అసలు ప్రభాస్ పెళ్లెప్పుడు? ఎవరితో? ఎప్పుడు చేసుకుంటారు? ఇవన్నీ అభిమానుల ముందున్న ప్రశ్నలు.

Prabhas : ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ మిస్సింగ్.. డిలీట్ అయ్యిందా..? హ్యాక్ అయ్యిందా..?

ప్రభాస్ పెళ్లి విషయంపై దివంగత నటుడు కృష్ణంరాజు భార్య ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. దసరా నవరాత్రుల్లో విజయవాడ దుర్గమ్మను దర్శించుకునేందుకు వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడారు. కృష్ణంరాజుగారు తమతో లేకపోయినా ఆయన పేరు నిలబెడుతూ తమ ఫ్యామిలీ ముందుకు వెళ్తోందన్నారామె. ప్రభాస్ పెళ్లి త్వరలోనే ఉంటుందని తను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాడని శ్యామలాదేవి చెప్పారు. అమ్మాయి ఎవరు? డేట్ ఎప్పుడు తెలియదు కానీ.. ఆ రోజు త్వరలోనే ఉందని స్పష్టం చేసారు. వచ్చే దసరా నాటికి ప్రభాస్ ఓ ఇంటివాడిగా ఉంటాడని శ్యామలాదేవి చెప్పారు. ఆవిడ చెప్పినట్లు ప్రభాస్ పెళ్లి త్వరలోనే ఉంటే అభిమానులకు ఆనందానికి హద్దు ఉండదు.