Prabhas : ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ మిస్సింగ్.. డిలీట్ అయ్యిందా..? హ్యాక్ అయ్యిందా..?

ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కనిపించడం లేదు. అకౌంట్ డిలీట్ అయ్యిందా..? లేదా హ్యాక్ అయ్యిందా..? అని అభిమానులు..

Prabhas : ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ మిస్సింగ్.. డిలీట్ అయ్యిందా..? హ్యాక్ అయ్యిందా..?

Tollywood rebal prabhas instagram account is missing

Updated On : October 15, 2023 / 2:22 PM IST

Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాల్లో తప్ప బయట పెద్దగా కనిపించడు. ఇతర హీరోల మాదిరి సోషల్ మీడియాలో అయిన కనిపిస్తాడు అనుకుంటే.. అక్కడ కూడా పెద్దగా సందడి చేయడు. టాలీవుడ్ లో ఉన్న స్టార్స్ అంతా ట్విట్టర్ లో అకౌంట్ మెయిన్‌టైన్ చేస్తూ వస్తున్నారు. కానీ ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్ మాత్రం ఉపయోగిస్తున్నాడు. ఆ ప్లాట్‌ఫార్మ్‌లో కూడా తన సినిమాలు, లేదా ఇతర స్టార్స్ సినిమాలకు సంబంధించి పోస్టులు తప్ప మరో పోస్టు వెయ్యడు. అయితే ఇప్పుడు ఆ ఇన్‌స్టాగ్రామ్ కూడా పోయినట్లు తెలుస్తుంది.

Also read : Renu Desai : పవన్ కళ్యాణ్‌తో విడాకుల తరువాత.. ఎందుకు పెళ్లి చేసుకోలేదో చెప్పిన రేణూదేశాయ్..

ప్రస్తుతం ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కనిపించడం లేదు. ఆ అకౌంట్ డిలీట్ అయ్యిందా..? లేదా హ్యాక్ అయ్యిందా..? అని అభిమానులు నెట్టింట తెగ వెతికేస్తున్నారు. గతంలో ప్రభాస్ పేస్‌బుక్ అకౌంట్ హ్యాక్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ మిస్ అవ్వడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఇక ఈ అకౌంట్ ఏమైందో అనేది ప్రభాస్ టీం నుంచి తెలియాల్సి ఉంది.

Also read : Bigg Boss 7 : బిగ్‌బాస్‌లో శ్రీలీల సందడి.. ఆ కంటెస్టెంట్ కాలేజీ జూనియర్ అంటా..

 

View this post on Instagram

 

A post shared by fasak.boss (@fasakboss)

కాగా ప్రభాస్ ప్రస్తుతం దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న సినిమా షూటింగ్ లో ఉన్నట్లు తెలుస్తుంది. ఆ మూవీ సెట్స్ నుంచి కొన్ని ఫోటోలు నెట్టింట లీక్ అయ్యాయి. ఆ పిక్స్ లో ప్రభాస్ వింటేజ్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ‘ఏక్ నిరంజన్’ సినిమా లుక్ లో ప్రభాస్ ఆ ఫొటోల్లో కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ తో ఈ మూవీ తెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది. ‘రాజా డీలక్స్’ అనే టైటిల్ ని అనుకుంటున్నట్లు సమాచారం. నిధి అగర్వాల్, రిధి కుమార్, మాళవిక మోహనన్ ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు.