Siddharth : ఆ జర్నలిస్ట్‌కి స్టేజి పైనే మాస్ వార్నింగ్ ఇచ్చిన సిద్దార్థ్.. మళ్ళీ అతన్నే ఫ్రెండ్ అంటూ..
'చిన్నా' మూవీ ప్రమోషన్స్ లో హీరో సిద్దార్థ్.. ఆ జర్నలిస్ట్‌కి స్టేజి పైనే మాస్ వార్నింగ్ ఇచ్చాడు.

Siddharth warning to journalist Suresh Kondeti at press meet
Siddharth : హీరో సిద్దార్థ్ రీసెంట్ గా తమిళంలో ‘చిత్తా’ అనే సినిమాతో సూపర్ హిట్టుని అందుకున్నాడు. తాజాగా ఈ మూవీ తెలుగులో కూడా రిలీజ్ కి సిద్దమవుతుంది. దీంతో తెలుగులో ఈ మూవీ ప్రమోషన్స్ ని మొదలు పెట్టాడు సిద్దార్థ్. ఈక్రమంలోనే నేడు ఒక ప్రెస్ మీట్ నిర్వహించాడు. ఈ ఈవెంట్ కి టాలీవుడ్ కి సంబంధించిన ప్రముఖ సినీ జర్నలిస్ట్ లు అంతా హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమంలో సిద్దార్థ్ ఒక ప్రముఖ జర్నలిస్ట్ కి స్టేజి పైనే మాస్ వార్నింగ్ ఇచ్చాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
ఈమధ్య వివాదాస్పద క్యూస్షన్స్ అడుగుతూ టాలీవుడ్ లో బాగా వైరల్ అయిన జర్నలిస్ట్ ‘సురేష్ కొండేటి’ (Suresh Kondeti). ఈ జర్నలిస్ట్ గురించి సిద్దార్థ్ మాట్లాడుతూ.. “సురేష్ కొండేటి కూడా ఇక్కడికి వచ్చారు. ఆయనికి ఒక వార్నింగ్. ఇది నేను ఇచ్చేది కాదు మొత్తం సోషల్ మీడియా ఇవ్వమన్నది. ప్రెస్ మీట్ లో పద్దతిగా కూర్చొని, పద్ధతిగా మైక్ పట్టుకొని, పద్ధతి ప్రశ్నలు అడగమనండి. ఆయన అడిగే చెత్త ప్రశ్నలకు మీరు జవాబులు ఇవ్వాల్సిన అవసరం లేదని నాకు సోషల్ మీడియాలో చెప్పారు” అంటూ ఒక వార్నింగ్ ఇచ్చాడు సిద్దార్థ్.
Also Read : Siddharth : నాకు నంది అవార్డు రాలేదు.. తెలుగులో ఇక సినిమాలు రిలీజ్ చేయను..
అయితే అంతలోనే దానిని కవర్ చేస్తూ.. సురేష్ కొండేటి తన ఫ్రెండ్ అని, తనని ఏదైనా అడిగే హక్కు తనకి ఉందని చెప్పుకొచ్చాడు. అయితే సిద్దార్థ్ ఇచ్చిన ఈ వార్నింగ్ ని ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. మీమ్స్ క్రియేట్ చేసి ట్రెండ్ చేస్తున్నారు. ఇక ఇవి చూసిన నెటిజెన్స్.. ఫన్నీ ఫన్నీ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. మరి సిద్దార్థ్ ఇచ్చిన ఆ వార్నింగ్ ని, మీమర్స్ చేసిన ఆ మీమ్స్ ని ఒకసారి మీరుకూడా చూసేయండి.
View this post on Instagram