Tillu Square : డీజే టిల్లు సౌండ్‌కి డేట్ షురూ.. పోస్టర్‌లో అనుపమతో సిద్దు రొమాన్స్!

సిద్దు జొన్నలగడ్డ నటిస్తున్న టిల్లు స్క్వేర్ నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.

Tillu Square : డీజే టిల్లు సౌండ్‌కి డేట్ షురూ.. పోస్టర్‌లో అనుపమతో సిద్దు రొమాన్స్!

Siddhu Jonnalagadda Anupama Parameswaran Tillu Square release date announce

Updated On : June 5, 2023 / 4:14 PM IST

Siddhu Jonnalagadda Tillu Square : సిద్దు జొన్నలగడ్డ హీరోగా 2022 లో ఆడియన్స్ ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న చిత్రం డీజే టిల్లు (DJ Tillu). రొమాంటిక్ క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ ని విపరీతంగా అలరించింది. బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా సిద్దుకి యూత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని తెచ్చి పెట్టింది. ఇక ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఇప్పుడు సీక్వెల్ ని తీసుకు వస్తున్నారు. టిల్లు స్క్వేర్ అనే టైటిల్ తో డబల్ ఎంటర్టైన్మెంట్ తో రెడీ అవుతుంది మూవీ.

Allu Arjun : బన్నీని మరొకరి ప్రేమలో పడేలా చేసిన స్నేహారెడ్డి.. ఎవరి ప్రేమలో పడ్డాడో తెలుసా?

కొన్ని నెలలుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ ఇవ్వబోతున్నట్లు మేకర్స్ తాజాగా తెలియజేశారు. ఈ క్రమంలోనే ఆ అప్డేట్ ని అనౌన్స్ చేశారు. ఈ మార్చిలోనే రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా షూటింగ్ లేట్ అవ్వడంతో వెనక్కి వెళ్ళింది. ఇటీవల ఈ సినిమా ఆగష్టులో చిరు, రజినీ సినిమాలతో పోటీగా రాబోతుంది అంటూ వార్తలు వచ్చాయి. తాజాగా ఈ సినిమాని సెప్టెంబర్ 15న రిలీజ్ చేయబోతున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు.

Adipurush : ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గెస్ట్ ఎవరో తెలుసా..? ఎవరూ ఊహించి ఉండరు..

కాగా ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) హీరోయిన్ గా నటిస్తుంది. రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ లో సిద్దు అండ్ అనుపమ రొమాన్స్ చూపిస్తూ మరింత క్యూరియాసిటీ పెరిగేలా చేస్తున్నారు. ఇక డీజే టిల్లుని విమల్ కృష్ణ తెరకెక్కిస్తే.. ఈ సీక్వెల్ ని మల్లిక్ రామ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాకి సిద్దునే కథని అందిస్తున్నాడు. రామ్ మిర్యాల ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. టిల్లు 1 సూపర్ హిట్ అవ్వడంతో ఈ మూవీ పై భారీ అంచనాలే నెలకొన్నాయి. మరి ఆ అంచనాలని టిల్లు అందుకుంటాడా? లేదా? చూడాలి.