Siddu Jonnalagadda : ‘కోహినూర్’ వజ్రాన్ని తీసుకొస్తానంటున్న సిద్ధూ జొన్నలగడ్డ.. పాన్ ఇండియా సినిమాతో..

దసరా పండగ పూట సిద్ధూ భారీ సినిమాని ప్రకటించాడు.

Siddu Jonnalagadda : ‘కోహినూర్’ వజ్రాన్ని తీసుకొస్తానంటున్న సిద్ధూ జొన్నలగడ్డ.. పాన్ ఇండియా సినిమాతో..

Siddu Jonnalagadda Announce Kohinoor Pan India Movie Poster Released on Dasara

Updated On : October 12, 2024 / 10:15 AM IST

Siddu Jonnalagadda : ఎన్నో ఏళ్లుగా సినీ పరిశ్రమలో ఉన్నా డీజే టిల్లుతో ఒక్కసారిగా స్టార్ హీరో అయ్యాడు సిద్ధూ జొన్నలగడ్డ. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు. తాజాగా అందర్నీ ఆశ్చర్యపరుస్తూ నేడు దసరా పండగ పూట సిద్ధూ భారీ సినిమాని ప్రకటించాడు.

సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై రవికాంత్ ప్రేరేపు దర్శకత్వంలో నేడు కోహినూర్ అనే సినిమాని ప్రకటించారు. కోహినూర్ – పార్ట్ 1 అని పోస్టర్ కూడా రిలీజ్ చేయడంతో ఈ సినిమా రెండు పార్టులుగా వస్తుందేమో అని భావిస్తున్నారు. ఈ పోస్టర్ లో చుట్టూ రాజుల కాలం లాంటి శిలా తోరణం ఉండగా మధ్యలో సిద్ధూ కత్తి పట్టుకొని కోహినూర్ వజ్రం పట్టుకొని ఉన్నాడు. దీంతో ఈ పోస్టర్ తోనే సినిమాపై ఆసక్తి నెలకొంది.

Image

భద్రకాళి మాత మహిమగా నిలిచిన కోహినూర్ వజ్రం మన దేశం దాటి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఆ వజ్రాన్ని మళ్ళీ తిరిగి తీసుకురావడానికి ఓ యువకుడు ఏం చేసాడు అనే కథాంశంతో ఈ సినిమా రాబోతుంది. అయితే దీంట్లో రాజుల కాలం కథ కూడా చూపించబోతున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమాని 2026 జనవరిలో రిలీజ్ చేస్తామని మూవీ యూనిట్ తెలిపారు. భారీ బడ్జెట్ తో ఈ కోహినూర్ సినిమా తెరకెక్కబోతుంది. మూవీ అనౌన్సమెంట్ తోనే సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

సిద్ధు జొన్నలగడ్డ ఆల్రెడీ డైరెక్టర్ రవికాంత్ తో ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ సినిమా తీసి హిట్ కొట్టాడు. ఇక సితార నిర్మాణ సంస్థతో ‘డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’ సినిమాలు తీసి హిట్ కొట్టాడు. దీంతో ఈ సినిమాతో కూడా ఈ కాంబోలు హిట్ కొడతారని భావిస్తున్నారు.