Chiranjeevi : చిరంజీవి ఆఫర్ ఇస్తే వద్దంటున్న యంగ్ హీరో.. చిరు పక్కన నటించకపోవడమే బెటర్ అంటూ..

మెగాస్టార్ చిరంజీవి ఆఫర్ కోసం ప్రతి ఒక్కరు ఆశగా ఎదురు చూస్తారు. కానీ ఒక యంగ్ హీరోకి పిలిచి మరి చిరు ఆఫర్ ఇచ్చినా కాదన్నాడని టాక్ వినిపిస్తుంది. చిరు పక్కన నటించకపోవడమే బెటర్ అంటూ..

Chiranjeevi : చిరంజీవి ఆఫర్ ఇస్తే వద్దంటున్న యంగ్ హీరో.. చిరు పక్కన నటించకపోవడమే బెటర్ అంటూ..

siddu jonnalagadda rejects Chiranjeevi offer in bro daddy remake

Updated On : July 13, 2023 / 5:01 PM IST

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలు చేస్తూ యంగ్ హీరోలను మించి బిజీగా ఉన్నారు. అంతేకాదు మెగా ఫ్యామిలో ఎంతోమంది నటీనటులు ఉన్నా తన పక్కన నటించే అవకాశం కొత్తగా వచ్చిన నటీనటులకే ఇస్తున్నారు. ఈ మధ్యకాలంలో చిరంజీవి నటించిన చాలా చిత్రాల్లో యంగ్ టాలెంట్ను ఎంకరేజ్ చేశారు. కొత్త దర్శకులు, నటీనటులతో సినిమాలు చేస్తూ టాటెంట్‌కే పెద్దపీట వేస్తున్నారు. త్వరలో చేయబోయే రెండు సినిమాలకూ యంగ్ డైరెక్టర్స్ నే ఎంపిక చేశారు మెగాస్టార్. బింబిసార లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన వశిష్ట, బంగార్రాజు మూవీతో హిట్ కొట్టిన కళ్యాణ్ కృష్ణ కాంబినేషన్ లో చిరంజీవి సినిమాలు రాబోతున్నాయి.

Mission Impossible 7 : మిషన్ ఇంపాజిబుల్ 7.. ఇండియాలో మొదటిరోజు ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా..?

ఇలా తన కొత్త ప్రాజెక్టులకు యంగ్ డైరెక్టర్లకు అవకాశం ఇచ్చిన చిరంజీవి.. తన సినిమాలో యువ నటీనటులను తీసుకోవాలని భావించారట. గాడ్ ఫాదర్ లో సత్యదేవ్ కు అవకాశం ఇచ్చినట్లు.. దర్శకుడు కళ్యాణ్ కృష్ణతో చేసే మలయాళ రిమేక్ చిత్రం బ్రో డాడీలో మరో యంగ్ హీరోకి అవకాశం ఇవ్వాలని చూశారు. చిరంజీవితోపాటు కీ రోల్ ఉండే పాత్రకు ఓ యంగ్ హీరో అవసరమయ్యారు. ఈ పాత్రకు ఎంతో మందిని పరిశీలించిన చిత్రం యూనిట్.. డిజె టిల్లు హీరో సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) అయితే ఆ పాత్రకు సరిపోతారని ఫిక్స్ అయ్యారట.. అంతేకాదు తమ ప్రతిపాదనను సిద్ధుకు కూడా చెప్పినట్లు ఇండస్ట్రీ టాక్.

AR Rahman : రామ్ చరణ్ RC16 కి మ్యూజిక్ చేస్తున్నా.. ఆ సినిమా గురించి చెప్పడానికి..

చిరంజీవితో సినిమా చేయాలని టాలీవుడ్‌లో ఎన్నో కలలు గంటుంటారు. ఎప్పుడెప్పుడు చాన్స్ వస్తుందా? అని ఎదురుచూస్తుంటారు. కానీ.. సిద్ధూ మాత్రం బ్రో డాడి మూవీలో చాన్స్ వద్దనుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. చిరుతో కలసి నటించడానికి సిద్ధూ ఇష్టపడటం లేదంటున్నారు. చిరంజీవి పక్కన ఉంటే తనకు యాక్టింగ్ స్కోప్ చాలా తక్కువ ఉంటుందని, ఆడియోన్స్ దృష్టి మొత్తం మెగాస్టార్ పైనే ఉంటుందని, ఆ కారణంగా చిరంజీవి పక్కన నటించకపోవడమే బెటర్ అని చెబుతున్నాడట ఈ కుర్ర హీరో.

Sadha : గ్రాండ్‌గా పెళ్లి చేసుకొని ఈమధ్య విడిపోతున్నారు.. హీరోయిన్ సదా కామెంట్స్ వైరల్..

గాడ్ ఫాదర్ లో సత్యదేవ్ పరిస్థితి ఇలానే అయిందని, ఇప్పుడు తనకూ అదే పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉందని భావిస్తున్నాడు సిద్ధూ. ఇప్పుడిప్పుడే టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకుంటున్న తాను.. చిరంజీవి పక్కన ఎంత పెద్ద పాత్ర చేసినా ప్రయోజనం ఉండదనేది సిద్ధూ వాదన. టాలీవుడ్‌లో చిరంజీవితో సినిమా చేసే అవకాశాన్ని గోల్డెన్ చాన్స్‌గా భావిస్తుంటారు. అలాంటిది సిద్ధూ ఏ ప్రయత్నం చేయకపోయినా.. మంచి చాన్స్ వస్తే వద్దనుకోవడం టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. కళ్యాణ్ కృష్ణ డైరెక్టర్‌గా… చిరంజీవి కూతురు సుష్మిత నిర్మాతగా త్వరలో షూటింగ్ ప్రారంభమయ్యే బ్రో డాడీలో ఇంకెవరికైనా చాన్స్ ఇస్తారా? లేక సిద్ధూనే ఒప్పిస్తారా? అనేది చూడాలి.