SIIMA Awards 2024 Full List Nani Dasara Hi Nanna Ruled with Many Awards
SIIMA 2024Awards : సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) – 2024 వేడుకలు ఘనంగా దుబాయిలో జరిగాయి. సెప్టెంబరు 14, 15 తేదీల్లో ఈ వేడుకలు దుబాయ్ లో జరుగుతున్నాయి. నిన్న మొదటి రోజు తెలుగు, కన్నడ సినీ పరిశ్రమలకు సంబంధించిన అవార్డుల వేడుక జరిగింది. 2023 సంవత్సరానికి గాను ఈ అవార్డులు అందచేశారు. ఈ వేడుకలకు సినీ సెలబ్రిటీలు చాలా మంది హాజరయ్యారు. పలువురు హీరోయిన్స్ స్పెషల్ పర్ఫార్మెన్స్ లు ఇచ్చారు.
Also Read : Devara : సినిమా హైప్ కోసం దర్శక, నిర్మాతల భారీ ప్లాన్!
2024 సైమా అవార్డుల ఫుల్ లిస్ట్ ఇదే..
బెస్ట్ యాక్టర్ – నాని(దసరా)
బెస్ట్ యాక్ట్రెస్ – కీర్తి సురేష్(దసరా)
బెస్ట్ డైరెక్టర్ – శ్రీకాంత్ ఓదెల(దసరా)
బెస్ట్ ఫిలిం – భగవంత్ కేసరి
బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ – దీక్షిత్ శెట్టి(దసరా)
బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ – బేబీ ఖియారా ఖాన్(హాయ్ నాన్న)
బెస్ట్ కమెడియన్ – విష్ణు(మ్యాడ్)
బెస్ట్ నెగిటివ్ రోల్ – దునియా విజయ్(వీరసింహ రెడ్డి)
బెస్ట్ డెబ్యూట్ యాక్ట్రెస్ – వైష్ణవి చైతన్య(బేబీ)
బెస్ట్ డెబ్యూట్ యాక్టర్ – సంగీత్ శోభన్(మ్యాడ్)
బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ – శౌర్యువ్(హాయ్ నాన్న)
బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ – అబ్దుల్ వాహబ్(హాయ్ నాన్న, ఖుషి)
బెస్ట్ సినిమాటోగ్రఫీ – భువన గౌడ(సలార్)
బెస్ట్ సింగర్ – రామ్ మిర్యాల(ఊరు పల్లెటూరు – బలగం)
బెస్ట్ యాక్టర్ క్రిటిక్స్ – ఆనంద్ దేవరకొండ(బేబీ)
బెస్ట్ యాక్ట్రెస్ క్రిటిక్స్ – మృణాల్ ఠాకూర్(హాయ్ నాన్న)
బెస్ట్ డైరెక్టర్ క్రిటిక్స్ – సాయి రాజేష్(బేబీ)
బెస్ట్ డెబ్యూట్ ప్రొడ్యూసర్స్ – వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్(హాయ్ నాన్న)
సైమా 2024 అవార్డుల్లో హాయ్ నాన్న సినిమా 5 అవార్డులు, దసరా సినిమా 4 అవార్డులు, బేబీ సినిమా 3 అవార్డులు సాధించాయి. ఇటీవల జరిగిన ఫిలిం ఫేర్ అవార్డుల్లో కూడా నాని దసరా సినిమా అదరగొట్టింది. గత సంవత్సరం నాని దసరా, హాయ్ నాన్న సినిమాలతో రాగా రెండు సినిమాలు మంచి విజయం సాధించి ఇప్పుడు బోలెడన్ని అవార్డులు దక్కించుకుంటున్నాయి. అవార్డుల్లో ప్రస్తుతం నాని హవా నడుస్తుంది.