Devara : సినిమా హైప్ కోసం దర్శక, నిర్మాతల భారీ ప్లాన్!
దేవర ప్రీ-రిలీజ్ ఈవెంట్‌పై అంచనాలు ఎక్కువవుతున్నాయి.

Pawan Kalyan as Chief Guest For Devara Pre Release event
Devara Pre Release event : దేవర ప్రీ-రిలీజ్ ఈవెంట్‌పై అంచనాలు ఎక్కువవుతున్నాయి. సినిమా ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో ప్రీ-రిలీజ్ ఈవెంట్‌పై అభిమానులు భారీ ఆశలు పెట్టుకుంటున్నారు. ఈ ఈవెంట్‌కు గెస్ట్‌గా ఎవరొస్తారా? అని ఎదురుచూస్తున్నారు. ఐతే ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని మంచి క్రేజ్ ఉన్న ఇద్దరు హీరోలను ముఖ్య అతిథులుగా ఆహ్వానించాలని మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇంతకీ దేవర ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు వచ్చే ఆ ఇద్దరు గెస్ట్‌లు ఎవరో ఇప్పుడు చూద్దాం…
జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్న దేవర సినిమా ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఈ నెల 22న హైదరాబాద్‌లో జరగనుంది. తొలుత ఏపీలో ఈ వేడుక నిర్వహించాలని చూసినా, విజయవాడ వరదల కారణంగా ఆ ఆలోచన విరమించుకున్నట్లు చెబుతున్నారు. ఐతే ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు మాత్రం రెండు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ ఉన్న హీరోలను గెస్ట్‌లుగా పిలవాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇందులో ఒకరు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అయితే మరొకరు ప్రిన్స్ మహేశ్ బాబు అంటున్నారు.
Vijay : విజయ్ లాస్ట్ సినిమా అనౌన్స్.. వచ్చే దసరాకు రిలీజ్.. పాలిటిక్స్ ని టార్గెట్ చేసి
దేవర ప్రీ-రిలీజ్ ఈవెంట్‍కు రావాలని డిప్యూటీ సీఎం పవన్‌న్ మేకర్స్ ఇప్పటికే అడిగారనే సమాచారం ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది. అయితే, ఈ విషయంపై పవన్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని అంటున్నారు. నందమూరి, నారా కుటుంబాలతో జూనియర్ ఎన్టీఆర్‌కు గ్యాప్ ఉండటం వల్ల.. తాను వెళితే బాగుంటుందా? లేదా? అనే విషయంలో డిప్యూటీ సీఎం తర్జనభర్జన పడుతున్నట్లు చెబుతున్నారు. ఐతే తమ కుటుంబాల మధ్య గ్యాప్ ఉన్నప్పటికీ దేవర సినిమా రేట్ల పెంపుపై సీఎం చంద్రబాబు ఉదారంగా వ్యవహరించడంతో పవన్ వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయంటున్నారు.
మరోవైపు పవన్‌తోపాటు మహేశ్‌బాబును సైతం గెస్ట్‌గా ఆహ్వానించారని అంటున్నారు. పవన్, మహేశ్‌బాబుతో జూనియర్ ఎన్టీఆర్‌కు మంచి రిలేషన్ ఉంది. దీంతో ఆ ఇద్దరూ తప్పకుండా వస్తారని ఆశిస్తున్నారు మేకర్స్. నిజంగా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు పవన్, మహేశ్‌బాబు వస్తే సినిమాకు మంచి హైప్ వచ్చినట్లేనంటున్నారు. దేవర చిత్రం ట్రైలర్ ఈ వారమే వచ్చింది. యాక్షన్ ప్యాక్డ్‌గా ఉన్న ఈ ట్రైలర్ పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది. అంచనాలను అందుకోవడంతో సినిమాపై క్రేజ్ మరింత పెరిగింది. ఎన్టీఆర్ యాక్షన్, కొరటాల టేకింగ్ ట్రైలర్‌లో ఆకట్టుకున్నాయి.
Jr NTR : క్యాన్సర్‌తో పోరాడుతున్న అభిమాని.. వీడియో కాల్ మాట్లాడిన ఎన్టీఆర్