Vijay : విజయ్ లాస్ట్ సినిమా అనౌన్స్.. వచ్చే దసరాకు రిలీజ్.. పాలిటిక్స్ ని టార్గెట్ చేసి

త‌మిళ స్టార్ హీరో విజ‌య్ చివ‌రి సినిమా ఖ‌రారైంది.

Vijay : విజయ్ లాస్ట్ సినిమా అనౌన్స్.. వచ్చే దసరాకు రిలీజ్.. పాలిటిక్స్ ని టార్గెట్ చేసి

Thalapathy 69 Vijay is the torchbearer in H Vinoths film

Updated On : September 14, 2024 / 6:38 PM IST

Thalapathy 69 – Vijay : త‌మిళ స్టార్ హీరో విజ‌య్ చివ‌రి సినిమా ఖ‌రారైంది. ఇందుకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ వ‌చ్చేసింది. విజ‌య్ కెరీర్‌లో 69 సినిమాగా తెర‌కెక్క‌నున్న ఈ మూవీకి హెచ్.వినోద్ ద‌ర్శ‌కుడు. కె.వి.ఎన్‌ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నుంది. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ నిర్మాణ సంస్థ అధికారిక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఈ చిత్రానికి అనిరుద్ సంగీతాన్ని అందించ‌నున్నాడు.

‘మా తొలి త‌మిళ సినిమా ద‌ళ‌ప‌తి 69 అని ప్ర‌క‌టిస్తున్నందుకు ఎంతో గ‌ర్వం, సంతోషంగా ఉంది. విజ‌య్‌తో క‌లిసి ప‌ని చేస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. ది టార్చ్ బేర‌ర్ ఆఫ్ డెమోక్ర‌సీ.. వ‌చ్చే ఏడాది అక్టోబ‌ర్‌లో మీ ముందుకు రానుంది.’ అని సోష‌ల్ మీడియాలో ఓ స‌రికొత్త పోస్ట‌ర్‌ను షేర్ చేసి రాసుకొచ్చింది. దీంతో విజ‌య్ అభిమానులు పండ‌గ చేసుకుంటున్నారు.

#Life Stories : ‘#లైఫ్ స్టోరీస్’ మూవీ రివ్యూ.. ఆరు కథలు..

పోస్ట‌ర్‌ను బ‌ట్టి చూస్తుంటే త‌న ఆఖ‌రి చిత్రాన్ని విజ‌య్ పూర్తిగా త‌న రాజ‌కీయ జీవితానికి ప‌నికొచ్చేలా చేయ‌నున్న‌ట్లుగా తెలుస్తోంది. పోస్ట‌ర్‌లో అగ్నితో వెలుగుతున్న కాగడ పట్టుకుని ఓ చేయి క‌నిపిస్తుంది. పైన ‘ద టార్చ్ బేరర్ ఆఫ్ డెమోక్రసీ’ అనే లైన్ క‌నిపిస్తోంది. ఈ చిత్రం 2025 అక్టోబ‌ర్‌లో విడుద‌ల కానుంది.

ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల‌నే ఉద్దేశంతో ‘తమిళగ వెట్రి కళగం’ అనే పార్టీని విజ‌య్ స్థాపించారు. 2026లో త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనే త‌మ పార్టీ పోటీ చేస్తుంద‌ని, అంత‌క ముందు జ‌రిగే ఏ ఎన్నిక‌ల్లోనూ పోటీ చేయ‌ద‌ని విజ‌య్ ఇప్ప‌టికే వెల్ల‌డించారు. ఇక పై సినిమాలు కూడా చేయ‌నని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. దీంతో హెచ్.వినోద్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కనున్న మూవీనే విజ‌య్‌కు ఆఖ‌రి సినిమా కానుంది. ఈ చిత్రం అనంత‌రం ఆయ‌న పూర్తిగా రాజ‌కీయాలపై ఫోక‌స్ పెట్ట‌నున్న‌ట్లు తెలుస్తోంది.

Jr NTR : క్యాన్స‌ర్‌తో పోరాడుతున్న అభిమాని.. వీడియో కాల్ మాట్లాడిన ఎన్టీఆర్‌