Singer Chinmayi files complaint with Hyderabad Police over trolling
Chinmayi: ప్రముఖ సింగర్ చిన్మయి పోలీసులను ఆశ్రయించారు. తనపై, తన కుటుంబంపై సోషల్ మీడియాలో దారుణమైన కామెంట్స్, ట్రోలింగ్స్ చేస్తున్నారు అంటూ ఆమె ఫిర్యాదు చేసింది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే, సింగర్ చిన్మయి భర్త రాహుల్ రవీంద్రన్ (Chinmayi)దర్శకుడిగా మారిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన దర్శకత్వంలో వస్తున్న సినిమా “ది గర్ల్ ఫ్రెండ్”. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు దర్శకుడు రాహుల్ రవీంద్రన్.
Adivi Sesh: అది మీడియా సృష్టి.. మాకు ఎలాంటి భయం లేదు.. ఇప్పటికే చాలా చూసాం.
ఈ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. నా భార్య చిన్మయి తనచుట్టూ జరిగే అన్యాయాల గురించి స్పందిస్తూ ఉంటుంది. నాకు కూడా ఈ ఆడ, మగ అని తేడాలుగా చూడటం నచ్చదు. అందరు సమానమే. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అనే దానికి వ్యతిరేకం. బహుశా నా భార్య చిన్మయి మైండ్ మార్చింది నేనే. ఆడవాళ్ళకి పెళ్లి అయ్యింది అని తెలుపడానికి తాళి, మెట్టెలు లాంటివి ఉన్నాయి. కానీ, మగవాళ్ళకి అలాంటివి ఏమీ లేదు. అందుకే, మేడలో తాళి వేసుకునే విషయంలో నేనేం ఫోర్స్ చేయను. అది పూర్తిగా తన నిర్ణయం” అంటూ చెప్పుకొచ్చాడు.
దీంతో,రాహుల్ రవీంద్రన్ చేసిన ఈ కామెంట్స్ పట్ల కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేశారు. వారిలో కొంతమంది చిన్మయిని ట్యాగ్ చేస్తూ ట్రోల్స్ చేస్తూ, అసభ్యకరమైన కామెంట్స్ చేస్తున్నారు. దీంతో, స్పందించిన చిన్మయి. పోలీసులకు ఫిర్యాదు చేసింది. “ట్రోలర్స్ నా పిల్లలు చనిపోవాలని అనుచితమైన మాటలు వాడుతున్నారు. అది భరించలేకపోతున్నా. రాయడానికి కూడా వీలులేని పదాలతో వేధింపులకు గురిచేస్తున్నారు. దయచేసి వారిపై కఠిన చర్యలు తీసుకోండి”అంటూ హైదరాబాద్ సీపీ సజ్జనార్‌కు ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేశారు చిన్మయి. దానికి సజనార్ కూడా స్పందిస్తూ చర్యలు తీసుకుంటాం అన్నట్టుగా కామెంట్ చేశారు.