Adivi Sesh: అది మీడియా సృష్టి.. మాకు ఎలాంటి భయం లేదు.. ఇప్పటికే చాలా చూసాం.
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. (Adivi Sesh)ఆయన గురించి, ఆయన సినిమాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆడియన్స్ ఊహకందని కథలతో మెస్మరైజ్ చేయడం అడివి శేష్ కి బాగా అలవాటు.
Hero Adivi Sesh made interesting comments on the competition with the Toxic movie
Adivi Sesh: టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన గురించి, ఆయన సినిమాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆడియన్స్ ఊహకందని కథలతో మెస్మరైజ్ చేయడం అడివి శేష్ కి బాగా అలవాటు. కేవలం కంటెంట్ ను మాత్రమే నమ్మి సినిమాలు చేసే హీరోలలో టాప్ పొజిషన్ లో ఉంటాడు శేష్. క్షణం, గూఢచారి, ఎవరు, హిట్ 3 లాంటి సినిమాలతో అది ప్రూవ్ చేశారు ఈ హీరో. అందుకే, ఆయన సినిమాలకి (Adivi Sesh)సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ప్రస్తుతం ఆయన హీరోగా వస్తున్న సినిమా డెకాయిట్. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా వస్తున్న ఈ సినిమాను కొత్త దర్శకుడు షామిలి డియో తెరకెక్కిస్తున్నాడు.
Deepthi Sunaina: క్రేజీ లుక్స్ తో కవ్విస్తున్న దీప్తి సునైనా.. ఫోటోలు
సరికొత్త కథా కథనంతో వస్తున్న ఈ సినిమా 2026 మర్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. చాలా కాలంగా విడుదలకు నోచుకోని ఈ సినిమా ఎట్టకేలకు వెచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, అదేరోజున కన్నడ స్టార్ యష్ హీరోగా వస్తున్న టాక్సిక్ సినిమా కూడా విడుదల కానుంది. పాన్ ఇండియా లెవల్లో హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కనున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి అలాంటి సినిమాతో పోటీకి దిగడం అంటే శామనే చెప్పాలి. ఇదే విషయాన్ని హీరో శేష్ వద్ద ప్రస్తావించగా ఆసక్తికర సమాధానం ఇచ్చాడు.
“ఈ బాక్సాఫీస్ వార్ అనేది మీడియా సృష్టి మాత్రమే. టాక్సిక్ సినిమా కూడా అదే రోజున విడుదల అవుతుందనే భయం మాకు ఏమాత్రం లేదు. సైలెంట్‌గా వచ్చి డెకాయిట్ తో హిట్‌ను సొంతం చేసుకుంటాను. ఊహించని కథ, కథనాలతో ప్రేక్షకులను ఆశ్చర్యపరచడం నా అలవాటు. గతంలో కూడా రెండు సినిమాలు ఒకేసారి విడుదలై విజయం సాధించిన సందర్భాలు చాలానే ఉన్నాయి.కేజీఎఫ్, జీరో సినిమాలు కూడా ఒకేసారి విడుదలై సూపర్ హిట్ అయ్యాయి. మాకు కూడా అదే నమ్మకం ఉంది. ప్రేక్షకులే విజేతను నిర్ణయిస్తారు. బాక్సాఫీస్ వార్ అనేదాన్ని ప్రేక్షకులు పట్టించుకోరు. కథే ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పిస్తుంది”అంటూ చెప్పుకొచ్చాడు శేష్. దీంతో ఈ హీరో చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
