Geetha Madhuri : నేను నోరు తెరిస్తే కాపురాలు కూలిపోతాయి.. గీత మాధురి కామెంట్స్ వైరల్..
గీతా మాధురి ఓ ఆసక్తికర విషయం చెప్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది. (Geetha Madhuri )
Geetha Madhuri
Geetha Madhuri : సింగర్ గా గీతామాధురి మంచి ఫేమ్ తెచ్చుకుంది. తన పాటలతో అందర్నీ మెప్పించింది. నందు భార్యగా, టీవీ షోలలో సందడి చేస్తూ ఇటీవల మరింత వైరల్ అయింది గీతామాధురి. ఓ పక్క తల్లిగా, భార్యగా ఫ్యామిలీ బాధ్యతలు నెరవేరుస్తూనే మరోవైపు సింగర్ గా, టీవీ షోలతో కూడా బిజీగా ఉంటుంది.
తాజాగా గీతా మాధురి సింగర్ నోయల్ సీన్ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన ప్రోమోని రిలీజ్ చేసారు. ఇందులో గీతా మాధురి ఓ ఆసక్తికర విషయం చెప్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
Also See : Shivathmika Rajashekar : బర్త్ డే స్పెషల్.. బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు షేర్ చేసిన శివాత్మిక..
గీత మాధురి మాట్లాడుతూ.. నేనెప్పుడో ఒక రోజు కాఫీ షాప్ కి వెళ్తా. ఆ రోజే ఏదో ఒక ప్రేమ జంట అదే కాఫీ షాప్ కి వచ్చి నాకు దొరికిపోతారు. నేను వెళ్లిన రోజే ఎవరో ఒకరు వచ్చి దొరుకుతారు. అలా నాకు చాలా మంది దొరికిపోయారు. వాటి గురించి నేను నోరు తెరిస్తే కాపురాలు కూలిపోతాయి అని చెప్పింది.
కాపురాలు కూలిపోయే రేంజ్ లో గీతామాధురి కనిపించే ప్రేమ జంటలు ఎవరో, టాలీవుడ్ జనాలా? లేక తనకు తెలిసిన వాళ్ళా, ఈ విషయం గురించి ఇంకేమైనా చెప్పిందా తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ వచ్చేదాకా ఎదురుచూడాల్సిందే.
