×
Ad

S Janaki: సింగర్ జానకి ఇంట విషాదం..

లెజెండరీ సింగర్ ఎస్. జానకి(S Janaki) కుమారుడు మురళీ కృష్ణ (65) తుదిశ్వాసవిడిచారు.

Singer Janaki son Murali Krishna passed away.

  • సింగర్ జానకి కుమారుడు మురళి కృష్ణ కన్నుమూత
  • ఆనారోగ్య సమస్యలతో మృతి
  • నటుడిగా, భరతనాట్య కళాకారుడిగా మురళి కృష్ణ గుర్తింపు

S Janaki: లెజెండరీ సింగర్ ఎస్. జానకి ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె ఏకైక కుమారుడు మురళీ కృష్ణ (65) తుదిశ్వాసవిడిచారు. ఈ వార్తను ప్రముఖ గాయని చిత్ర సోషల్ మీడియాలో పంచుకున్నారు. తనను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న కుమారుడి మరణంతో జానకి కన్నీరుమున్నీరవుతున్నారు. ఇక మురళి కృష్ణ మరణం పట్ల ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఇక మురళీ కృష్ణ భరతనాట్యంలో గొప్ప ప్రావీణ్యం గల వ్యక్తి. కొన్ని సినిమాల్లో నటుడిగా కూడా కనిపించారు. గత కొన్నేళ్లుగా పాటలకు దూరంగా ఉంటున్న తల్లి జానకిని అపురూపంగా చూసుకుంటున్నాడు. ఇప్పుడు ఆయన మరణంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Krithi Shetty: పాపం కృతి శెట్టి.. తమిళ్ లో ఫస్ట్ సినిమా.. అది కూడా పోయినట్టే!