Krithi Shetty: పాపం కృతి శెట్టి.. తమిళ్ లో ఫస్ట్ సినిమా.. అది కూడా పోయినట్టే!
ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి(Krithi Shetty) మొదటి తమిళ సినిమా వా..వాతియార్ కి ఆడియన్స్ నుంచి నెగిటీవ్ టాక్.
Krithi Shetty vaa vaathiyaar movie received negative talk from audience.
- మారని కృతి శెట్టి ఫేట్
- వా.. వాతియార్ సినిమాకు నెగిటీవ్ టాక్
- ఆశలన్నీ LIK పైనే
Krithi Shetty: ఉప్పెన బ్యూటీ కృతి శెట్టికి ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తోంది. ఈ మధ్య కాలంలో ఆమె నటించిన ఒక్క సినిమా కూడా హిట్ అవడం లేదు. తెలుగులో ఉప్పనే, శ్యామ్ సింఘా రాయ్, బంగార్రాజు తరువాత ఆమె చాలా సినిమాలు చేసింది. కానీ, ఒక్క హిట్ కూడా అందుకోలేదు. దాంతో, టాలీవుడ్ లో ఆమెకు ఆఫర్స్ తగ్గుముఖం పట్టాయి. కనీసం ఇండస్ట్రీ మారిస్తే అయినా హిట్ వస్తుందని భావించింది.
అలా మలయాళ ఇండీస్ట్రీలో మొదటి సినిమా చేసింది. అదే ‘ఏఆర్ఏం’. టోవినో థామస్ హీరోగా వచ్చిన ఈ పాన్ ఇండియా మూవీ మంచి విజయాన్ని సాధించింది. అయినా కూడా ఆమెకు మలయాళం నుంచి ఆశించిన గుర్తింపు రాలేదు. ఆఫర్స్ కూడా రాలేదు. దాంతో తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. ఆమె తమిళంలో నటించిన లేటెస్ట్ అండ్ ఫస్ట్ మూవీ వా.. వాతియార్. స్టార్ హీరో కార్తీ నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల అయ్యింది.
Srinath Maganti: శ్రీనాథ్ మాగంటికి బంపర్ ఆఫర్.. ఈ నగరానికి ఏమైంది సీక్వెల్‌లో కీ రోల్!
అయితే, పలుమార్లు విడుదల వాయిదా వేస్తూ వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి ఆశించిన రిజల్ట్ రాలేదు. కథ, కథనం రొటీన్ గా ఉండటంతో వా.. వాతియార్ సినిమాను ఆడియన్స్ రిజెక్ట్ చేశారు. అలా తమిళంలో మొదటి సినిమా కూడా కృతి శెట్టి(Krithi Shetty)కి ఆశించిన విజయాన్ని అందించలేకపోయింది. ఇక ఈ అమ్మడు ప్రస్తుతం తమిళంలోనే చేస్తున్న మరో సినిమా LIK.
లేటెస్ట్ సెన్సేషన ప్రదీప్ రంగనాథన్ హీరోగా వస్తున్న ఈ సినిమాను దర్శకుడు విగ్నేష్ శివన్ తెరకెక్కిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సినిమాలో కూడా నటించే అవకాశాన్ని దక్కించుకుందట ఈ బ్యూటీ. ఈ సినిమాలో ఆమె చిరంజీవి కూతురిగా కనిపిస్తుందని టాక్. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
