Singer Saketh : ఆ సింగర్ పై సింగర్ సాకేత్ సంచలన వ్యాఖ్యలు.. ఓవర్ రేటెడ్ అంటూ..

తాజాగా సింగర్ సాకేత్ ఓ ఇంటర్వ్యూలో సిద్ శ్రీరామ్ పై వ్యాఖ్యలు చేసాడు.

Singer Saketh : ఆ సింగర్ పై సింగర్ సాకేత్ సంచలన వ్యాఖ్యలు.. ఓవర్ రేటెడ్ అంటూ..

Singer Saketh Sensational Comments on Sid Sriram goes Viral

Updated On : May 10, 2025 / 3:24 PM IST

Singer Saketh : ఇటీవల కొన్ని రోజుల క్రితం వరకు ఎక్కువగా తెలుగు సినిమాల్లో సిద్ శ్రీరామ్ సాంగ్స్ బాగా వినిపించేవి. మొదట్లో కొన్ని పాటలు హిట్ అవ్వడంతో సినిమా వాళ్లంతా సిద్ శ్రీరామ్ వెనక పడ్డారు. ఈ క్రమంలో సిద్ శ్రీరామ్ కూడా రెమ్యునరేషన్ బాగా పెంచేసాడని వార్తలు వచ్చాయి. ఆల్రెడీ పలువురు సిద్ శ్రీరామ్ ఒకే మూసలో సాంగ్స్ పాడుతున్నాడు అని, కొత్తదనం ఉండట్లేదు అని సోషల్ మీడియాలో విమర్శలు చేసారు.

తాజాగా సింగర్ సాకేత్ ఓ ఇంటర్వ్యూలో సిద్ శ్రీరామ్ పై వ్యాఖ్యలు చేసాడు. ఆ షోలో ఓవర్ రేటెడ్ సింగర్ అని ఎవర్ని చూస్తే అనిపిస్తుంది అని అడగ్గా సాకేత్ సమాధానమిస్తూ.. అందరూ బాగానే పాడతారు. కానీ సిద్ శ్రీరామ్ కొంత ఓవర్ రేటెడ్ సింగర్ అనిపించింది. ఈవెన్ రెమ్యునరేషన్ విషయంలో కూడా అతను ఓవర్ రేటెడ్. అతను NRI కాబట్టి వర్కౌట్ అయింది. మనోళ్లకు పక్కింటి పుల్లకూర రుచి కదా అని అన్నాడు. దీంతో సాకేత్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మరి దీనిపై సిద్ శ్రీరామ్ ఏమైనా స్పందిస్తాడా చూడాలి.

Also Read : Singer Saketh : చిన్నప్పుడు హార్ట్ లో హోల్.. పెద్దయ్యాక వెన్నెముక సర్జరీ.. అందర్నీ నవ్వించే సింగర్ సాకేత్ లో ఇన్ని బాధలు ఉన్నాయా?

అలాగే అండర్ రేటెడ్ సింగర్స్ ఎవరైనా ఉన్నారా అని అడగ్గా.. కౌశిక్ కళ్యాణ్, శ్రీ సౌమ్య అండర్ రేటెడ్ అనిపిస్తుంది, వాళ్లకు రావాల్సినంత గుర్తింపు రాలేదు అనిపిస్తుంది అని చెప్పాడు. స్వరం తక్కువ సోకులు ఎక్కువ ఎవరికి అని అడగ్గా సింగర్ రేవంత్ కి అని చెప్పాడు.