‘ఫిదా’ హీరో ఎంగేజ్ మెంట్.. అమ్మాయి పేరులో ట్విస్ట్!

ఫిదా హీరోకు ఎంగేజ్ మెంట్ అయింది.. అమ్మాయి పేరులో మాత్రం సస్పెన్స్ దాగి ఉంది… ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు.. ఫిదా మూవీలో వరుణ్ తేజ్‌కు అన్నయగా నటించిన రాజా చెంబోలు.. ప్రముఖ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి తనయుడు కూడా.. రాజా తన నిశ్చితార్థం జరిగిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఫొటోలను షేర్ చేశాడు..
2020లోనే బెస్ట్ పార్ట్. కొత్త జీవితాన్ని ఆరంభించేందుకు ఆతృతగా ఎదురు చూస్తున్నా. అందరి ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు అంటూ పోస్టు పెట్టాడు.. కానీ, ఇక్కడ తనకు కాబోయే భార్య సతీమణి పేరు మాత్రం సస్పెన్స్ లో ఉంచాడు..
ఇప్పటివరకూ రాజా.. ఫిదా మూవీతో పాటు పలు తెలుగు చిత్రాల్లో నటించాడు.. అందులో ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’, ‘హ్యాపీ వెడ్డింగ్’, ‘అంతరిక్షం’, ‘మిస్టర్ మజ్ను, రణరంగం వంటి పలు చిత్రాల్లో నటించారు. ‘మస్తీ’ అనే వెబ్‌సిరీస్‌లోనూ నటించారు..