Sirivennela, Spb And Siva Shankar Master
Sirivennela: తన పదాలతో తెలుగు సాహిత్యానికి సరికొత్త అందాన్ని తీసుకొచ్చి.. తన పద ప్రయోగంతో తెలుగు సినిమా పాటలకు సరికొత్త అర్థాన్ని చెప్పిన ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అనారోగ్యంతో కన్నుమూశారు.
Sirivennela Sitarama Sastri : ‘సిరివెన్నెల’ సినీరంగ ప్రవేశం..
సినీ, రాజకీయ ప్రముఖులు, ఇతర రంగాలకు చెందిన వారు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు, అభిమానులు, సాహితీ వేత్తలు, సంగీత కళాకారులు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. వారి మృతికి సంతాపం తెలియజేస్తున్నారు.
Sirivennela Family : సిరివెన్నెల కుమారులిద్దరూ సినీ పరిశ్రమలోనే..
సోషల్ మీడియాలో హృదయాన్ని హత్తుకునే ఎన్నో ఫొటోలు, పోస్టులు వైరల్ అవుతున్నాయి. సిరివెన్నెల పాటల రూపంలో చెప్పిన జీవిత సత్యాలు, ప్రేమ, కుటుంబ బంధాలు, మానవ సంబంధాలు ఇలా ప్రతి అంశానికి సంబంధించిన విషయాలపై పెద్ద ఎత్తున పోస్టులు వైరల్ అవుతున్నాయి.
Sirivennela : సిరివెన్నెలకి గూగుల్ నివాళి..
ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఓ ఫొటో అందర్నీ భావోద్వేగానికి గురి చేస్తుంది. కంటతడి పెట్టిస్తుంది. ఇటీవల ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే గానగంధర్వుడు ఎస్పీ బాలు, శివశంకర్ మాస్టర్లతో ‘పాడటానికి, ఆడటానికి మీరు ఉంటే సరిపోతుందా.. పదం రాయడానికి నేను అక్కర్లేదా.. వచ్చేస్తున్నా’.. అంటున్నట్లు ఉన్న ఫొటో చూసినవారందరినీ భావోద్వేగానికి గురిచేస్తోంది.
Sirivennela : సిరివెన్నెల పాటల పూదోటలో వికసించిన అవార్డులు..
భౌతికంగా సిరివెన్నెల మన మధ్య లేకపోవచ్చు.. కానీ ఆయన అన్ని విషయాలను తన పాటల ద్వారా.. తన రచనల ద్వారా.. తన సాహిత్యం ద్వారా భావితరాలకు అందించే వెళ్లారు. ప్రతీ అక్షరంలో జీవిత సత్యాన్ని బోధించే వెళ్ళారు. పాటలు ఎంజాయ్ చేయడానికి మాత్రమే కాదు.. మంచిని బోధించడానికి.. మన సంసృతిని కాపాడుకోవడానికి అని నిరూపించిన అక్షర జ్ఞానికి 10 టీవీ నివాళులర్పిస్తోంది.