సెన్సార్ పూర్తి చేసుకున్న సీత

రీసెంట్‌గా సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది సీత. సినిమా చూసిన సెన్సార్ టీమ్, కొన్ని కట్స్ చెప్పి, యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది..

  • Published By: sekhar ,Published On : May 16, 2019 / 05:00 AM IST
సెన్సార్ పూర్తి చేసుకున్న సీత

Updated On : May 16, 2019 / 5:00 AM IST

రీసెంట్‌గా సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది సీత. సినిమా చూసిన సెన్సార్ టీమ్, కొన్ని కట్స్ చెప్పి, యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది..

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్‌జంటగా.. తేజ డైరెక్షన్‌లో రూపొందుతున్న మూవీ.. సీత.. ATV సమర్పణలో, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్  బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న సీత టీజర్ అండ్ థియేట్రికల్ ట్రైల‌ర్‌కి మంచి రెస్పాన్స్ వస్తుంది. ‘నిజమేనా’ అనే లిరికల్ సాంగ్ కూడా ఆడియన్స్‌ని ఆకట్టుకుంటుంది. రీసెంట్‌గా సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది సీత. సినిమా చూసిన సెన్సార్ టీమ్, కొన్ని కట్స్ చెప్పి, యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. సినిమా నిడివి 161 నిమిషాలు.

రామాయణంలోని సీత క్యారెక్టర్‌‌ని, రాముడు క్యారెక్టర్‌ని ఈ జెనరేషన్‌కి తగ్గట్టు డిజైన్ చేసి, సీత మూవీ రూపంలో ఒక చక్కని మెసేజ్ ఇచ్చారని సీత టీమ్‌ని ప్రశంసించిందట సెన్సార్ బృందం. సోనూసూద్ విలన్‌గా నటించగా, మన్నారా చోప్రా కాజల్ ఫ్రెండ్‌గా కనిపించనుంది. మే 24న సీత రిలీజవుతుంది.

ఈ సినిమాకి కెమెరా : శీర్షా రే, సంగీతం : అనూప్ రూబెన్స్, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వర రావు, మాటలు : లక్ష్మీ భూపాల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కిషోర్ గరికపాటి, కో-ప్రొడ్యూసర్స్ : అజయ్ సుంకర, అభిషేక్ అగర్వాల్.

వాచ్ సీత ట్రైలర్..