సీత : మే 24న వస్తుంది..

పలు తేదీలు పరిశీలించిన తర్వాత, సీత చిత్రాన్ని మే 24న విడుదల చెయ్యనున్నట్టు మూవీ యూనిట్ కన్ఫమ్ చేసింది. కాజల్ క్యారెక్టరైజేషన్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్‌‌ల కెమిస్ట్రీ హైలెట్ అవుతాయని మేకర్స్ చెప్తున్నారు..

  • Published By: sekhar ,Published On : May 6, 2019 / 07:50 AM IST
సీత : మే 24న వస్తుంది..

Updated On : May 6, 2019 / 7:50 AM IST

పలు తేదీలు పరిశీలించిన తర్వాత, సీత చిత్రాన్ని మే 24న విడుదల చెయ్యనున్నట్టు మూవీ యూనిట్ కన్ఫమ్ చేసింది. కాజల్ క్యారెక్టరైజేషన్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్‌‌ల కెమిస్ట్రీ హైలెట్ అవుతాయని మేకర్స్ చెప్తున్నారు..

నేనేరాజు నేనేమంత్రి సినిమాతో చాలాకాలం తర్వాత సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చాడు దర్శకుడు తేజ. ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్‌ జంటగా సీత మూవీ చేస్తున్నాడు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నాడు. ఇటీవల విదేశాల్లో లాంగ్ షెడ్యూల్ షూట్ చేసారు. సోనూ సూద్ విలన్‌గా కనిపించనుండగా, పాయల్ రాజ్‌పుత్ స్పెషల్ సాంగ్‌లో ఆడిపాడింది. సీత టీజర్‌కి, పాయల్ బుల్ రెడ్డి సాంగ్‌కి మంచి రెస్పాన్స్ వస్తుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.

పలు తేదీలు పరిశీలించిన తర్వాత, సీత చిత్రాన్ని మే 24న విడుదల చెయ్యనున్నట్టు మూవీ యూనిట్ కన్ఫమ్ చేసింది. కాజల్ క్యారెక్టరైజేషన్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్‌‌ల కెమిస్ట్రీ హైలెట్ అవుతాయని మేకర్స్ చెప్తున్నారు. ఈ సినిమాకి కెమెరా : షీర్షా రే, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వర రావు, సంగీతం : అనూప్ రూబెన్స్, మాటలు : లక్ష్మీ భూపాల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కిషోర్ గరికపాటి, కో-ప్రొడ్యూసర్స్ : అజయ్ సుంకర, అభిషేక్ అగర్వాల్, సమర్పణ : ATV.

వాచ్ సీత టీజర్..