నాపేరు సీత – నేను గీసిందే గీత

ATV సమర్పణలో, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న సీత థియేట్రికల్ ట్రైలర్ రీసెంట్‌గా రిలీజ్ చేసింది మూవీ యూనిట్..

  • Published By: sekhar ,Published On : May 10, 2019 / 05:01 AM IST
నాపేరు సీత – నేను గీసిందే గీత

Updated On : May 10, 2019 / 5:01 AM IST

ATV సమర్పణలో, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న సీత థియేట్రికల్ ట్రైలర్ రీసెంట్‌గా రిలీజ్ చేసింది మూవీ యూనిట్..

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్‌జంటగా.. తేజ డైరెక్షన్‌లో రూపొందుతున్న మూవీ.. సీత.. ఇంతకుముందు రిలీజ్ చేసిన సీత టీజర్‌కి, పాయల్ రాజ్‌పుత్ బుల్ రెడ్డి సాంగ్‌కి మంచి రెస్పాన్స్ వస్తుంది. ATV సమర్పణలో, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న సీత థియేట్రికల్ ట్రైలర్ రీసెంట్‌గా రిలీజ్ చేసింది మూవీ యూనిట్.. మనుషుల కంటే మనీనే  ముఖ్యం అనుకునే కాజల్, ఎలాగైనా తనని సొంతం చేసుకోవాలనే పంతంతో ఉన్న సోనూసూద్, సీతని సేవ్ చేసే సాయి.. ఎత్తుకు పై ఎత్తులు.. రకరకాల ట్విస్టులతో సాగింది సీత ట్రైలర్..

కాజల్ యాటిట్యూడ్ డిఫరెంట్‌‌గా ఉంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్‌‌ల కెమిస్ట్రీ బాగుంది. మన్నారా చోప్రా కాజల్ ఫ్రెండ్‌గా కనిపించనుందీ సినిమాలో.. ట్రైలర్‌లో షీర్షా రే ఫొటోగ్రఫీ, అనూప్ రూబెన్స్ ఆర్ఆర్ హైలెట్ అయ్యాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న సీత మూవీని మే 24న విడుదల చెయ్యనున్నారు. ఈ సినిమాకి ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వర రావు, మాటలు : లక్ష్మీ భూపాల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కిషోర్ గరికపాటి, కో-ప్రొడ్యూసర్స్ : అజయ్ సుంకర, అభిషేక్ అగర్వాల్.

వాచ్ సీత ట్రైలర్..