Siva Karthikeyan Don Movie Ott Streaming Date Locked
Don: తమిళ యంగ్ హీరో శివ కార్తికేయన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘డాన్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటోంది. ఇప్పటికే రూ.100 కోట్ల గ్రాస్ క్లబ్‌లో చేరిన డాన్, శివకార్తికేయన్ కెరీర్‌లో మరో బ్లాక్‌బస్టర్ మూవీగా నిలిచింది.
Siva Karthikeyan : జాతిరత్నాలు డైరెక్టర్‌తో శివకార్తికేయన్ సినిమా ప్రారంభం
ఇక ఈ సినిమాను త్వరలోనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇంకా థియేటర్లలో సాలిడ్‌గా రన్ అవుతున్న ఈ సినిమాను జూన్ 10న ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమయ్యిందట. త్వరలోనే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం తమిళ ఆడియెన్స్‌తో పాటు తెలుగు ఆడియెన్స్ కూడా ఓటీటీలో ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు.
Siva Karthikeyan : కమల్ హాసన్‌తో శివ కార్తికేయన్ సినిమా!
సిబి చక్రవర్తి తెరకెక్కించిన ఈ సినిమాలో శివకార్తికేయన్ సరసన ప్రియాంకా మోహన్ హీరోయిన్‌గా నటించింది. మరి డాన్ సినిమాకు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో తెలియాలంటే జూన్ 10 వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు సినీ ఎక్స్‌పర్ట్స్.