Siva Karthikeyan : నా కెరీర్ రైలు లాంటిది.. విజయ్ కెరీర్ రాకెట్ లాంటిది.. విజయ్ తో కలిసి మల్టీస్టారర్ చేయాలనుకుంటున్నా..
ప్రిన్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శివ కార్తికేయన్ విజయ్ దేవరకొండ గురించి మాట్లాడుతూ.. ''ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో స్మార్ట్ హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకరు. తన గీత గోవిందం సినిమా నాకు చాలా ఇష్టం. చాలా సార్లు ఆ సినిమా చూశాను. విజయ్ అంత...............

Siva Karthikeyan speech in Prince Pre Release Event
Siva Karthikeyan : తమిళ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ హీరోగా, యుక్రెయిన్ నటి మరియా హీరోయిన్ గా జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ప్రిన్స్. మంగళవారం సాయంత్రం ప్రిన్స్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ప్రిన్స్ సినిమా దీపావళి కానుకగా ఈ నెల 21న విడుదల కానుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విజయ్ దేవరకొండతోపాటు దర్శకుడు హరీష్ శంకర్ అతిథులుగా హాజరయ్యారు.
ప్రిన్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శివ కార్తికేయన్ విజయ్ దేవరకొండ గురించి మాట్లాడుతూ.. ”ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో స్మార్ట్ హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకరు. తన గీత గోవిందం సినిమా నాకు చాలా ఇష్టం. చాలా సార్లు ఆ సినిమా చూశాను. విజయ్ అంత బాగుంటాడు కాబట్టే అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది. నేను 20 ఇయర్స్ గా కష్టపడుతూ ఈ స్టేజి కి వచ్చాను. నా జర్నీ ట్రైన్ జర్నీ లాంటిది. కానీ విజయ్ జర్నీ రాకెట్ లాంటిది. చాలా తక్కువ టైంలో పాన్ ఇండియా హీరో అయ్యాడు. అతని జర్నీ అందరికి స్ఫూర్తినిస్తుంది. అతనితో కలిసి పని చేయాలనుకుంటున్నాను. మేమిద్దరం కలిసి ఓ సినిమాలో కనిపించాలి అనుకుంటున్నాను” అన్నారు. దీనికి విజయ్ దేవరకొండ కూడా ఓకే చెప్పాడు.
”హరీష్ శంకర్ సర్ గబ్బర్ సింగ్ సినిమా చెన్నైలో థియేటర్స్ లో చూస్తే ఆడియన్స్ రచ్చ అంతా ఇంతా కాదు. నేను కూడా అంత బాగా ఎంజాయ్ చేశాను. అలాగే అనుదీప్ సినిమాల్లోనే కాదు బయట కూడా నవ్విస్తూ డిఫరెంట్ గా ఉంటాడు. నేను తెలుగు అతని దగ్గరే నేర్చుకుంటున్నాను. ఈ సినిమాలో నవ్వుతో పాటు ఓ మెసేజ్ కూడా ఉంటుంది” అని తెలిపి మిగిలిన చిత్ర యూనిట్ అందరికి ధన్యవాదాలు తెలిపారు.