Sivaji : సినిమా రిలీజ్ కి ముందే శివాజీకి ఫుల్ ప్రాఫిట్స్..? పైగా అది బోనస్..
శివాజీ, లయ జంటగా ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు.(Sivaji)
Sivaji
Sivaji : నటుడు శివాజీ తన సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతున్నారు. కోర్ట్, దండోరా సినిమాలతో తన నటనతో మరోసారి ప్రేక్షకులని మెప్పించి నటుడిగా ఫుల్ బిజీ అయ్యాడు. మరో పక్క నిర్మాతగా కూడా మారాడు. శివాజీ నిర్మాత గా మారి తన సొంత బ్యానర్ శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై శివాజీ, లయ జంటగా ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు.(Sivaji)
ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్, టీజర్ రిలీజ్ చేసి క్రైమ్ కామెడీ అని అంచనాలు పెంచారు. అయితే ఇది ఈటీవీ విన్ ఓటీటీలో డైరెక్ట్ గా రిలీజ్ అవ్వాలి. కానీ చివరి నిమిషంలో థియేటర్ రిలీజ్ కి ప్లాన్ చేసారు. సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని సినిమా థియేటరికల్ రిలీజ్ డేట్ ని నేడు ప్రకటించనున్నారు.
Also Read : Sree Vishnu : ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్.. శ్రీవిష్ణు కష్టం ఎవరికీ రాకూడదు.. పాపం..
ఈ సినిమా రిలీజ్ కి ముందే ప్రాఫిట్స్ తెచ్చేసుకుంది. సుమారు కోటి రూపాయలు పైగా పెట్టి ఈ సినిమాని నిర్మించారు శివాజీ. ఈ సినిమాకు ఈటీవీ విన్ ఓటీటీ దాదాపు మూడు కోట్లు ఆఫర్ చేసి కొనుక్కుందని సమాచారం. దీంతో డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ తోనే రెండు కోట్ల వరకు శివాజీకి ప్రాఫిట్స్ వచ్చాయి. ఇప్పుడు థియేట్రికల్ రిలీజ్ ప్లాన్ చేయడంతో థియేట్రికల్ రైట్స్ దాదాపు కోటి రూపాయలు వరకు అమ్ముడయినట్టు సమాచారం. ఇది శివాజీకి బోనస్.
దీంతో శివాజీ నిర్మాతగా మారి సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని సినిమాతో రిలీజ్ కి ముందే ప్రాఫిట్స్ సంపాదించేసాడు. ఓ పక్క నటుడిగా, మరో పక్క నిర్మాతగా సెకండ్ ఇన్నింగ్స్ లో శివాజీ సక్సెస్ అవుతున్నాడని అభినందిస్తున్నారు. మరి ఈ క్రైమ్ కామెడీ సినిమా ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో చూడాలి.
