Sivaji Raja – Chiranjeevi : ఆ రోజు చిరంజీవి మీద ప్రామిస్ చేసి.. ఇప్పటివరకు మళ్ళీ సిగరెట్ ముట్టుకోలేదు.. ఎన్నేళ్ళయిందో తెలుసా?

తాజాగా శివాజీరాజా ఇంటర్వ్యూ ఇవ్వగా ఓ ఆసక్తికర విషయం తెలిపారు.

Sivaji Raja Leaves Smoking Habit due to Megastar Chiranjeevi

Sivaji Raja – Chiranjeevi : నటుడు శివాజీ రాజా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో వందల సినిమాల్లో నటించి మెప్పించాడు. గతంలో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న శివాజీరాజా ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తున్నారు. తాజాగా శివాజీరాజా ఇంటర్వ్యూ ఇవ్వగా ఓ ఆసక్తికర విషయం తెలిపారు.

Also Read : Sivaji Raja Pet Dog : రామ్ చరణ్ దగ్గర ఉన్న కుక్కపిల్ల లాంటిదే కావాలని.. శివాజీరాజా పెంపుడు కుక్కపిల్ల కోసం.. 30 ఏళ్ళ కోరిక..

శివాజీరాజా మాట్లాడుతూ.. నేను సిగరెట్ ఎక్కువగా కాల్చేవాడ్ని. రోజుకి ఒక పెట్టె లేదా ఇంకా ఎక్కువే కాల్చేవాడ్ని. మా మదర్, వైఫ్, శ్రీకాంత్.. ఇలా చాలా మంది మీద ప్రామిస్ చేశా కానీ మానెయ్యలేదు. 2000 డిసెంబర్ 31 నైట్ బెంగుళూ చిరంజీవి గారి ఫామ్ హౌస్ లో మా మెగాస్టార్ మీద ప్రామిస్ చేశా. ఆయన చేతుల మీద చేయి పెట్టి ప్రామిస్ చేశా. మళ్ళీ లైఫ్ లో సిగరెట్ ముట్టుకోలేదు. ఇప్పటికి ఆల్మోస్ట్ 25 ఏళ్ళు అయింది అని తెలిపారు.