Sivaji : జైలు నుంచి రిలీజైన పల్లవి ప్రశాంత్‌తో శివాజీ వీడియో.. ఏం మాట్లాడారో తెలుసా..?
జైలు నుంచి రిలీజైన పల్లవి ప్రశాంత్‌తో శివాజీ ఇన్‌స్టా లైవ్ కి వచ్చారు. ఆ లైవ్ లో శివాజీ మాట్లాడుతూ..

Sivaji with Pallavi Prasanth in instagram live after releasing from police custody
Sivaji – Pallavi Prasanth : ఇటీవల బిగ్‌బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ ని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నాలుగు రోజుల పాటు జైల్లో ఉన్న పల్లవి ప్రశాంత్.. కొన్ని షరతులతో కూడిన బెయిల్ పై బయటకి వచ్చాడు. కాగా బిగ్‌బాస్ హౌస్ లో శివాజీ, పల్లవి ప్రశాంత్, యావర్ ఒక గ్రూప్ గా ఉండి ఆడిన సంగతి తెలిసిందే. అయితే బయటకి వచ్చిన తరువాత శివాజీ, ప్రశాంత్ ని పట్టించుకోవడం లేదని, అరెస్ట్ విషయంలో కూడా దూరంగా ఉంటున్నాడని కామెంట్స్ వినిపించాయి.
శివాజీ వీటికి రియాక్ట్ అవుతూ.. ఇటీవల ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు. ప్రశాంత్ మరియు తనకి ఉన్న బంధాన్ని పదేపదే నిరూపించుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. తాజాగా జైలు నుంచి రిలీజైన పల్లవి ప్రశాంత్‌తో శివాజీ ఇన్‌స్టా లైవ్ కి వచ్చారు. ఆ లైవ్ లో శివాజీ మాట్లాడుతూ.. “శివాజీ అన్న ఎక్కడ, ఎక్కడ అని అడుగుతున్నారు. నువ్వు చెప్పారా ప్రశాంత్ నేను ఎక్కడ ఉన్నాను” అని అడగగా, ప్రశాంత్ బదులిస్తూ.. “నా గుండెల్లో” అంటూ పేర్కొన్నాడు.
Also read : Nani : నానికి తన కొడుకు అర్జున్ ఇచ్చిన క్రిస్మస్ గిఫ్ట్ ఏంటో చూశారా..?
ఇక ఇదే లైవ్ లో శివాజీ మాట్లాడుతూ..
“కన్నడలో ‘లూస్ మాద’ అనే హీరో ఉన్నాడు. ప్రశాంత్ ని చూసినప్పుడు నాకు అతనే గుర్తుకు వస్తాడు. ప్రశాంత్ లో ఒక హీరో ఉన్నాడు. నేను హౌస్ లో ఉన్నప్పుడు అదే చెబుతున్నాను. ఇప్పుడు అదే చెబుతున్నాను. ప్రశాంత్ లో ఉన్న ఆ హీరో బయటకి రావాలి. ఈ చిన్న చిన్న విషయంలో కూడా నేను మాట్లాడడం ఏంటి. చట్టప్రకారం వాడే ఒక హీరోలా బయటకి వస్తాడు. ఇప్పుడు అదే జరిగింది.
చిన్న వయసులో గెలిచాను అనే ఆనందంలో అందర్నీ కలవాలి అనే ఉత్సాహంలో ఏదో ఓ గందరగోళం జరిగింది. వాటన్నిటిని ప్రశాంత్ సరిదిద్దుకుంటాడు. అది మీరు కూడా చూస్తారు. నాగార్జున గారు ముందే చెప్పారు. హౌస్ నుంచి బయటకి వెళ్లిన తరువాత ఎలా ఉంటుందో అని. అది మాకు హెల్ప్ అవుతుంది. ఇక విజేత ఎవరు అనేదాని పై ఎవరు ఎన్ని కామెంట్స్ చేసినా పెద్ద పట్టించుకునేది లేదు. ఎందుకంటే విన్నర్ ఎవరు అనేది ప్రజలు నిర్ణయిస్తారు” అంటూ చెప్పుకొచ్చారు.