మిస్టర్ లోకల్ ఫస్ట్ లుక్
శివ కార్తికేయన్ మిస్టర్ లోకల్ ఫస్ట్ లుక్ రిలీజ్.

శివ కార్తికేయన్ మిస్టర్ లోకల్ ఫస్ట్ లుక్ రిలీజ్.
కనా మూవీ హిట్ అయిన తర్వాత, తమిళ యంగ్ స్టార్ హీరో శివ కార్తికేయన్, నయనతార జంటగా, రాజేష్ ఎమ్. డైరెక్షన్‌లో ఒక సినిమా రూపొందబోతుంది. స్టూడియో గ్రీన్ కె.ఇ.జ్ఞానవేల్ రాజా ప్రొడ్యూస్ చేస్తున్నాడు. శివ కార్తికేయన్‌కి హీరోగా ఇది 13వ సినిమా. రీసెంట్‌గా ఈ సినిమాకి మిస్టర్ లోకల్ అనే టైటిల్ ఫిక్స్ చేసి, ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో.. బ్లాక్ సూట్‌లో, గాగుల్స్‌తో, ఒక కాలు పైన పెట్టి, చేతిలో టీ గ్లాస్ పట్టుకుని నవ్వుతూ ఛైర్‌లో కూర్చున్నాడు శివ కార్తికేయన్..
హిప్ హాప్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. 2019 సమ్మర్‌లో మిస్టర్ లోకల్ రిలీజ్ కానుంది. మరోవైపు ఇండ్రు నేట్రు నాలై సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న రవికుమార్ డైరెక్షన్‌లోనూ ఒక సినిమా చేస్తున్నాడు శివ కార్తికేయన్.. ఈ సినిమాలో సైంటిస్ట్‌గా కనిపించనున్నాడు.
వాచ్ ఫస్ట్ లుక్…