SJ Suryah – Game Changer : ‘దిమ్మ తిరిగి బొమ్మ కనపడుద్ది’.. గేమ్ ఛేంజర్ సినిమాపై SJ సూర్య ట్వీట్..

SJ సూర్య ట్వీట్ తో గేమ్ ఛేంజర్ సినిమాపై మరిన్ని అంచనాలు పెరుగుతున్నాయి.

SJ Suryah Interesting Tweet on Ram Charan Game Changer Movie

SJ Suryah – Game Changer : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. సంక్రాంతికి జనవరి 10న గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ కానుంది. శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో భారీగా ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు పాటలు, టీజర్ రిలీజ్ చేయగా అంచనాలు భారీగా పెరిగాయి. మెగా ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.

Also Read : Balakrishna – Urvashi Rautela : ఆ భామతో ‘డాకు మహారాజ్’ ఐటెం సాంగ్..? వీడియో వైరల్..

ఇక ఈ సినిమాలో SJ సూర్య విలన్ గా నటిస్తున్నాడు. తాజాగా SJ సూర్య ఈ సినిమాపై ఆసక్తికర ట్వీట్ చేసాడు. SJ సూర్య తన ట్వీట్ లో.. హాయ్ ఫ్రెండ్స్, నేను గేమ్ ఛేంజర్ సినిమాలోని రెండు ముఖ్యమైన సీన్స్ డబ్బింగ్ ఇప్పుడే పూర్తిచేశాను. ఆ సీన్స్ లో ఒకటి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారితో, ఇంకోటి శ్రీకాంత్ తో ఉన్నాయి. ఈ రెండు సీన్స్ డబ్బింగ్ చెప్పడానికి నాకు మూడు రోజులు పట్టింది. ఆ సీన్స్ అవుట్ పుట్ దీనమ్మ దిమ్మ తిరిగి బొమ్మ కనపడుద్ది అనిపించేలా వచ్చింది. థియేటర్స్ లో అరుస్తారు ఆ సీన్స్ కి. పోతారు మొత్తం పోతారు. థ్యాంక్యూ డైరెక్టర్ శంకర్ గారు ఈ అవకాశం ఇచ్చినందుకు. దిల్ రాజు గారు సంక్రాంతికి ర్యాంప్ ఆడిస్తున్నారు అంటూ ట్వీట్ చేసాడు.

SJ సూర్య ట్వీట్ తో గేమ్ ఛేంజర్ సినిమాపై మరిన్ని అంచనాలు పెరుగుతున్నాయి. ఇక ఈ సినిమా నుంచి త్వరలోనే మెలోడీ సాంగ్ ఒకటి రానుంది అని తమన్ ఇటీవలే తెలిపాడు.