Smile Seenu : రాజమౌళి, సుదీప్ ప్రచారకర్తలు.. ఆ డైరెక్టర్ ఎమ్మెల్యే పోటీ.. కర్ణాటక ఎలక్షన్స్‌లో సినిమా గ్లామర్!

ఈసారి కర్ణాటక ఎలక్షన్స్ లో సినిమా గ్లామర్ ఎక్కువైనట్లు కనిపిస్తుంది. రాజమౌళి, కిచ్చా సుదీప్ ప్రచారకర్తలుగా వ్యవహరిస్తుంటే, మరో యంగ్ డైరెక్టర్ ఎమ్మెల్యేగా పోటీకి సిద్దమయ్యాడు.

Smile Seenu MLA nomination Karnataka Elections 2023 Sudeep Rajamouli

Smile Seenu : సినీ తారలు రాజకీయ రంగంలోకి అడుగు పెట్టడం కొత్తేమి కాదు. ఆడియన్స్ ని ఎంటర్‌టైన్ చేసిన హీరోలు, హీరోయిన్లు, కమెడియన్స్ ఇలా చాలా మంది ప్రజలకి సేవ చేసేందుకు రాజకీయంలోకి అడుగుపెట్టారు. తాజాగా ఒక యంగ్ డైరెక్టర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశాడు. కర్ణాటకలో (Karnataka Elections 2023) వచ్చే నెల ఎన్నికలు జరగబోతున్న సంగతి అందరికి తెలిసిందే. కన్నడ పరిశ్రమలో ‘బళ్ళారి దర్బార్’, ‘తుఫాన్’, ‘ఓ మై లవ్’ సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు నారి శ్రీనివాసులు (స్మైల్ శ్రీను).

Rajamouli: మహేష్‌తో అడ్వెంచర్ చేయించేందుకు జక్కన్న ముహూర్తం ఫిక్స్ చేశాడా..?

స్మైల్ శ్రీను ఈ ఎన్నికల్లో విజయనగర్ జిల్లా కూడ్లీగి నియోజకవర్గం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) తరుపున ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా నామినేషన్ దాఖలు చేశాడు. అనంతరం మీడియా విలేకరులతో మాట్లాడుతూ.. గత ఐదు సంవత్సరాలు బీజేపీ ఎమ్మెల్యే ఎన్ వై గోపాల కృష్ణ నియోజకవర్గానికి ఏమి చేసింది లేదన్నాడు. అంతేకాకుండా తనని ఎన్నుకున్న నియోజకవర్గం ప్రజలను మోసం చేసి బీజేపీ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరాడు అంటూ ఆరోపించాడు.

RRR : అమిత్ షాతో RRR టీం భేటీ.. ఆస్కార్ గెలుపు పై చర్చ..

స్వార్ధ రాజకీయాల కోసం తమ స్వార్ధ ప్రయోజనాల కోసం ప్రజలను మోసం చేసినట్లు తాను చేయనంటూ, తనని గెలిపించాలని నియోజకవర్గం ప్రజలను పత్రిక సమక్షంలో కోరారు. కాగా ఈ ఎన్నికల్లో కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ (Sudeep) కూడా భాగం కానున్నాడు. ఈ ఎన్నికల్లో బీజేపీ పార్టీ తరుపు నుంచి సుదీప్ ప్రచారం చేయనున్నాడు. అలాగే టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) కూడా ఈ ఎన్నికల్లో ప్రచారం చేయనున్నాడు. అయితే రాజమౌళి ప్రచారం రాజకీయ పార్టీ గురించి కాదు, ఓటు హక్కు ఉపయోగించుకోవాలి అని ప్రచారం చేయనున్నాడు.