Rajamouli: మహేష్‌తో అడ్వెంచర్ చేయించేందుకు జక్కన్న ముహూర్తం ఫిక్స్ చేశాడా..?

దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి తన నెక్ట్స్ మూవీని స్టార్ హీరో మహేష్ బాబుతో చేస్తున్నట్లు గతంలోనే ప్రకటించాడు.

Rajamouli: మహేష్‌తో అడ్వెంచర్ చేయించేందుకు జక్కన్న ముహూర్తం ఫిక్స్ చేశాడా..?

Rajamouli Mahesh Babu Movie To Have a Grand Launch In November

Updated On : April 18, 2023 / 12:20 PM IST

Rajamouli: దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి ఆర్ఆర్ఆర్ మేనియా నుండి బయటకొచ్చి, ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై ఫోకస్ పెట్టారు. తన నెక్ట్స్ మూవీని స్టార్ హీరో మహేష్ బాబుతో చేస్తున్నట్లు గతంలోనే ప్రకటించిన ఈ స్టార్ డైరెక్టర్, ప్రస్తుతం స్క్రిప్టును ఫైనల్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్‌తో కలిసి మహేష్ మూవీకి సంబంధించిన స్క్రిప్టు పనుల్లో బిజీగా ఉన్నాడు.

Rajamouli : వరల్డ్ మోస్ట్ పవర్ ఫుల్ లిస్ట్‌లో రాజమౌళి పేరు..ఫస్ట్ ఇండియన్ డైరెక్టర్ గా చరిత్ర సృష్టించిన జక్కన్న..

ఈ ప్రాజెక్టును అనౌన్స్ చేసిన దగ్గర్నుండి ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఇక ఈ సినిమాను ఎప్పుడెప్పుడు లాంచ్ చేస్తారా అని అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ ప్రెస్టీజియస్ మూవీని నవంబర్ నెలలో స్టార్ట్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా స్క్రిప్టును బౌండ్ చేసి, ఆ వెంటనే ఈ సినిమాను లాంచ్ చేయాలని రాజమౌళి భావిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో మహేష్ సరికొత్త అవతారంలో కనిపిస్తాడని చిత్ర యూనిట్ చెబుతోంది.

Rajamouli – Mahesh Babu : రాజమౌళి సినిమాలో మహేష్ హనుమంతుడి పాత్ర.. అమెజాన్ అడవుల్లో సాహసం!

ఈ సినిమాను పూర్తి అడ్వెంచర్ మూవీగా తెరకెక్కించేందుకు రాజమౌళి అండ్ టీమ్ రెడీ అవుతున్నారు. ఈ సినిమా ఆఫ్రికా అడవుల నేపథ్యంలో తెరకెక్కనుందని.. ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేయనున్నట్లుగా చిత్ర యూనిట్ తెలిపింది. మరి నిజంగానే ఈ ప్రెస్టీజియస్ మూవీని నవంబర్‌లో లాంచ్ చేస్తారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ విషయంపై చిత్ర యూనిట్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేసేవరకు వెయిట్ చేయాల్సిందే.