Surakshith Battina : శోభన్ బాబు మనవడు గిన్నిస్ వరల్డ్ రికార్డ్.. గురువు రికార్డునే బద్దలుకొట్టి.. డాక్టర్ గా ఎన్నో అవార్డులు, రివార్డులు..

శోభన్ బాబు మనవడు డాక్టర్ సురక్షిత్ బత్తిన వైద్యరంగంలో ఓ అరుదైన శస్త్రచికిత్స చేసి గిన్నిస్ రికార్డు బ్రేక్ చేశాడు.

Sobhan Babu Grand Son Surakshith Battina Creates New Guinness World Record in Medical Field

Surakshith Battina : టాలీవుడ్ సోగ్గాడుగా ఎన్నో సినిమాలతో ప్రేక్షకులను మెప్పించి, అభిమానులను సంపాదించుకున్నారు దివంగత నటుడు శోభన్ బాబు. ఆయన కుటుంబం నుంచి ఎవర్ని సినీ పరిశ్రమ వైపుకు రానివ్వలేదు. తాజాగా శోభన్ బాబు మనవడు వైరల్ అవుతున్నాడు. శోభన్ బాబు కూతురు మృదుల కొడుకు సురక్షిత్ బత్తిన సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్.

శోభన్ బాబు మనవడు డాక్టర్ సురక్షిత్ బత్తిన వైద్యరంగంలో ఓ అరుదైన శస్త్రచికిత్స చేసి గిన్నిస్ రికార్డు బ్రేక్ చేశాడు. ఇటీవలే సురక్షిత్ బతిన చెన్నైలో ట్రూ 3డీ ల్యాపరోస్కోపిక్‌ ద్వారా తమిళనాడుకు చెందిన 44 ఏళ్ల మహిళకు భారీ కణితి ఉన్న 4.5 కిలోల గర్భాశయాన్ని తొలగించారు. 2019లో సురక్షిత్ గురువు డాక్టర్ సిన్హా 4.1 కిలోల గర్భాశయాన్ని ల్యాపరోస్కోపీ శస్త్ర చికిత్స ద్వారా తొలగించి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డుల్లో స్థానం పొందగా ఇప్పుడు గురువు రికార్డునే బద్దలు కొట్టి గిన్నిస్ రికార్డ్ సాధించారు. దీంతో వైద్య రంగం నుంచి, ప్రజల నుంచి ఆయనకు అభినందనలు అందుతున్నాయి.

Also Read : Jabardasth Tanmay : డ్రంక్ & డ్రైవ్ కేసుపై క్లారిటీ ఇచ్చిన జబర్దస్త్ తన్మయి.. పాపం ఫోటో ఇద్దామని దిగితే అడ్డంగా బుక్ చేసేసారు..

సురక్షిత్ చెన్నైలో తొలిసారిగా రోగులు త్వరగా కోలుకునేలా ట్రూ 3డీ ల్యాపరోస్కోపిక్‌ వ్యవస్థను తీసుకొచ్చాడు. 2016లో చెన్నై అన్నానగర్‌ లో ఇండిగో ఉమెన్స్‌ సెంటర్‌ను స్థాపించారు. అప్పటి నుంచి పలు రికార్డు ఆపరేషన్లు నిర్వహించారు. కెరీర్‌లో 10వేలకు మించిన శస్త్రచికిత్సలు చేశారు. ఇప్పటికే 40కి పైగా కీలక అవార్డులు, రివార్డులోను అందుకున్నారు.

అలాగే సోషల్ మీడియాలో మహిళల ఆరోగ్య సమస్యల అవగాహన పెంచుతున్నారు. తన తాత శోభన్ బాబు పేరుమీద ఇప్పటికీ వీలు కుదిరినప్పుడల్లా ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తుంటాడట. మొత్తానికి నట భూషణుడు శోభన్ బాబు రీల్ హీరో అయితే ఆయన మనవడు రియల్ హీరోగా, డాక్టర్ గా ఎంతోమంది ప్రాణాలు కాపాడుతూ, ఎంతోమందికి మాతృత్వం అందిస్తున్నాడని అంతా ఆయన్ని అభినందిస్తున్నారు.

Also Read : Jabardasth Tanmay : వాళ్ళు నేను చచ్చానా బతికానా అని కూడా పట్టించుకోలేదు.. కిరాక్ ఆర్పీ మోసం చేసాడు.. జబర్దస్త్ తన్మయి కామెంట్స్ వైరల్..