Jabardasth Tanmay : వాళ్ళు నేను చచ్చానా బతికానా అని కూడా పట్టించుకోలేదు.. కిరాక్ ఆర్పీ మోసం చేసాడు.. జబర్దస్త్ తన్మయి కామెంట్స్ వైరల్..

తనకు యాక్సిడెంట్ అయినప్పుడు ఎవ్వరూ పట్టించుకోలేదని చెప్పింది జబర్దస్త్ తన్మయి.

Jabardasth Tanmay : వాళ్ళు నేను చచ్చానా బతికానా అని కూడా పట్టించుకోలేదు.. కిరాక్ ఆర్పీ మోసం చేసాడు.. జబర్దస్త్ తన్మయి కామెంట్స్ వైరల్..

Jabardasth Tanmay Sensational Comments on Kirak RP and Jabardasth Members

Updated On : May 5, 2025 / 3:03 PM IST

Jabardasth Tanmay : జబర్దస్త్ లో లేడీ గెటప్స్ తో మొదలుపెట్టి ట్రాన్స్ జెండర్ గా మారింది తన్మయి. జబర్దస్త్ తో బాగానే గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా చాన్నాళ్ల తర్వాత తన్మయి ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా అనేక విషయాలు చెప్పింది. ఈ క్రమంలో తనకు యాక్సిడెంట్ అయినప్పుడు ఎవ్వరూ పట్టించుకోలేదని చెప్పింది.

తన్మయి మాట్లాడుతూ.. గతంలో ఓ సారి జబర్దస్త్ నుంచి బయటకు వచ్చాను. జబర్దస్త్ నుంచి బయటకు వచ్చాక యాక్సిడెంట్ అయింది. కార్ లో వెళ్తుంటే బర్రెని గుద్దేసి పడిపోయా. నుదుటి మీద సర్జరీ, ముక్కుకు సర్జరీ అయింది. ఆల్మోస్ట్ కోమాలోకి వెళ్లే పరిస్థితి. నేను బెడ్ మీద ఉన్నాను. అందరికి ఈ విషయం తెలుసు. కనీసం నేను బతికానా చచ్చానా అని కూడా జబర్దస్త్ లో ఎవరూ పట్టించుకోలేదు. ఎవరూ సపోర్ట్ చేయలేదు, ఎవరూ హెల్ప్ చేయలేదు. కొంతమందిని నేను అడిగినా కూడా హెల్ప్ చేయలేదు. కొంతమంది అయితే మోసం చేసారు అని తెలిపింది.

Also Read : Delhi Capitals : రామ్‌చ‌ర‌ణ్‌ ‘పెద్ది’ షాట్ ను రీక్రియేట్ చేసిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ బ్యాట‌ర్‌.. వీడియో అదుర్స్‌..

అలాగే.. కిరాక్ ఆర్పీ నన్ను మోసం చేసాడు. ఒకప్పుడు నేను అతనికి సపోర్ట్ చేశాను, ఫైనాన్షియల్ గా కూడా సపోర్ట్ చేసాను. అన్న అంటూ తిరిగాను. కానీ అతను నాకేమి చేయలేదు. అదిరింది షో నుంచి అతని వల్లే బయటకు వచ్చేసాను. నమ్మకం పోగొట్టాడు. నేను అతనికి ఎంత చేసానో జబర్దస్త్ వాళ్లందరికీ తెలుసు. కానీ అతను నన్ను మోసం చేసాడు అని ఎమోషనల్ అవుతూ చెప్పింది తన్మయి.