Jabardasth Tanmay : డ్రంక్ & డ్రైవ్ కేసుపై క్లారిటీ ఇచ్చిన జబర్దస్త్ తన్మయి.. పాపం ఫోటో ఇద్దామని దిగితే అడ్డంగా బుక్ చేసేసారు..
ఇన్నేళ్ల తర్వాత తన్మయి అదంతా ఫేక్ అని ఆ ఘటనపై క్లారిటీ ఇచ్చింది.

Jabardasth Tanmay gives Clarity on her Drink and Drive Case
Jabardasth Tanmay : ఒక్కోసారి సెలబ్రిటీలు కూడా డ్రంక్ & డ్రైవ్ కేసులో దొరికినట్టు, డ్రింక్ చేసి వాహనం నడిపినట్టు వార్తలు వస్తూ ఉంటాయి. అలా ఓ నాలుగేళ్ల క్రితం జబర్దస్త్ తన్మయి కూడా డ్రంక్ & డ్రైవ్ కేసులో దొరికింది అని వార్తలు వచ్చాయి. ఇన్నేళ్ల తర్వాత తన్మయి అదంతా ఫేక్ అని ఆ ఘటనపై క్లారిటీ ఇచ్చింది.
తన్మయి మాట్లాడుతూ.. హైదరాబాద్ లో ఓ ఈవెంట్ కి నేను, కొంతమంది జబర్దస్త్ మెంబర్స్ వెళ్ళాము. వాళ్లంతా అటునుంచి వేరే ఊరు వెళ్తుండటంతో నేను ఒక్కదాన్నే రిటర్న్ అయ్యాను. నాకు క్యాబ్ బుక్ చేస్తే క్యాబ్ లో ఇంటికి వెళ్తున్నాను. ఆ రోజు వీకెండ్ కావడంతో పోలీసులు డ్రంక్ & డ్రైవ్ చెక్ చేస్తున్నారు. డ్రైవర్ ని చెక్ చేసారు. వెనక నన్ను చూసి ఒక ఫోటో దిగొచ్చా మేడం అని పోలీస్ అడిగితే నేను కార్ కిందకు దిగి ఫోటో ఇచ్చాను. ఆ ప్లేస్ లో నన్ను అలా చూడటంతో నేను తాగి బుక్ అయినట్టు, యాక్సిడెంట్ చేసినట్టు రాసారు. పేపర్స్, ఛానల్స్ అన్నిట్లో ఆ వార్త వచ్చింది. అసలు నాకు డ్రైవింగ్ రాదు, నాకు డ్రింక్ అలవాటు లేదు కానీ వార్తలు ఇష్టమొచ్చినట్టు రాసారు. నాగబాబు గారు ఆ సమయంలో సపోర్ట్ చేసారు. ఛానల్స్ వాళ్ళతో మాట్లాడితే అప్పుడు వాళ్ళు నాకు సారీ చెప్పారు అని తెలిపింది.
పాపం ఫోటో ఇద్దామని దిగితే డ్రంక్ & డ్రైవ్ లో ఇరికినట్టు వార్తలు రాసేశారు అని బాధపడింది జబర్దస్త్ తన్మయి.