Image Credits : Vogue India
Sobhita – Naga Chaitanya : నాగచైతన్య – శోభిత గత సంవత్సరం డిసెంబర్ లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత చైతూ తండేల్ సినిమాతో బిజీగా ఉండటంతో అది రిలీజయి పెద్ద హిట్ అయిన తర్వాత ఇప్పుడు ఒకరికి ఒకరు టైం ఇచ్చుకుంటున్నారు. ఇద్దరూ కలిసి వెకేషన్ కి వెళ్తూ టైం స్పెండ్ చేస్తున్నారు. తాజాగా చైతన్య – శోభిత వోగ్ ఇండియా మ్యాగజైన్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఈ ఇంటర్వ్యూలో ఇద్దరూ అనేక ఆసక్తికర అంశాలు పంచుకున్నారు. ఒకరిపై ఒకరు సరదాగా చాడీలు కూడా చెప్పుకున్నారు. చైతు తన భార్య శోభిత గురించి చెప్తూ.. శోభిత ఫుడ్ ని ఎప్పుడూ ప్రశాంతంగా ఆస్వాదిస్తూ తినాలని అనుకుంటుంది. తినే సమయంలో ఎవరైనా మాట్లాడిస్తే తనకు నచ్చదు. తినేటప్పుడు తాను మాట్లాడదు అని తెలిపాడు.
Also Read : Rajamouli : మహేష్ సినిమా షూటింగ్ లొకేషన్ వీడియో షేర్ చేసిన రాజమౌళి.. ట్రెక్కింగ్ చేసి పైకెక్కి..
దీనికి సమాధానంగా శోభిత.. ఒంటరిగా భోజనం చేయడం ఒక కళ. ముంబైలో నేను ఒంటరిగా నివసించేటప్పుడు అలాగే తినేదాన్ని. పెళ్లి అయ్యాక ఫ్యామిలీ అందరితో కలిసి తినడం ఒక మంచి అనుభూతి అని తెలిపింది. ఇక శోభిత చైతు గురుంచి చెప్తూ.. తన ఫేవరేట్ బైక్ క్లీనింగ్ కి రెండు గంటలు టైం ఇస్తాడు అని చెప్పింది. ఇలా ఒకరిపై ఒకరి సరిగదా చాడీలు చెప్పారు.