Sobhita Dhulipala : సమంతను పెళ్లికూతురిగా చూసి ఏడ్చేశాను.. శోభిత ధూళిపాళ!

ఈమధ్య నాగచైతన్యతో (Naga Chaitanya), శోభిత ధూళిపాళ (Sobhita Dhulipala) కలిసి ఉన్న ఒక పిక్ బయటకి వచ్చి వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా శోభిత తన ఇన్‌స్టాగ్రామ్‌లో.. సమంతను పెళ్లికూతురిగా చూసి ఏడ్చేశాను అంటూ పోస్ట్ వేసింది.

Sobhita Dhulipala post about Samantha - Pic Source Instagram

Sobhita Dhulipala : తెలుగు అమ్మాయి అయిన శోభిత ధూళిపాళ (Sobhita Dhulipala) మోడలింగ్ రంగంలో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రస్తుతం సినీ పరిశ్రమలో స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకొని వరుస సినిమాలు చేస్తుంది. నార్త్ టు సౌత్ మాత్రమే కాదు హాలీవుడ్ లో కూడా ఒక సినిమా చేస్తుంది. ఇది ఇలా ఉంటే, ఇటీవల శోభిత పేరు అక్కినేని హీరో విషయంలో గట్టిగా వినిపిస్తుంది. నాగచైతన్యతో (Naga Chaitanya) ఈ భామ సీక్రెట్ ప్రేమాయణం నడుపుతుంది అంటూ గత కొంత కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈమధ్య వీరిద్దరూ కలిసి ఉన్న ఒక పిక్ బయటకి వచ్చి ఆ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చింది.

Naga Chaitanya – Sobhita : నాగ చైతన్యతో శోభిత ధూళిపాళ డేటింగ్ నిజమేనా?.. నెల క్రితమే బయటపెట్టిన చెఫ్.. ఇప్పుడు వైరల్ అవుతున్న ఫొటో..

నాగచైతన్య ఒక ప్రముఖ చెఫ్ కి ఫొటోగ్రాఫ్ ఇస్తున్న సమయంలో.. కెమెరా లెన్స్ కి శోభిత కూడా చిక్కింది. ఆ ఫోటోని ఆ చెఫ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన తరువాత ఫొటోలో దాగున్న శోభితను నెటిజెన్లు గుర్తించి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అయితే ఆ ఫోటో గురించి ఇద్దరి వైపు నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. తాజాగా శోభిత తన ఇన్‌స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ వేసింది. ఆ పోస్ట్ లో సమంతను పెళ్లికూతురిగా చూసి ఏడ్చేశాను అంటూ రాసుకొచ్చింది. ఇక ఆ మాటలు చూసిన నెటిజెన్లు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.

Sobhitha Dhulipala : చీరలో వయ్యారాలు పోతున్న శోభిత ధూళిపాళ

కాగా అసలు విషయం ఏంటంటే, శోభిత సిస్టర్ పెళ్లి విశాఖపట్నంలో ఘనంగా జరుగుతుంది. ఆ వేడుకలు మొత్తం శోభితనే దగ్గరుండి చూసుకుంటుంది. శోభిత సిస్టర్ పేరు కూడా ‘సమంత’ కావడం విశేషం. ఈ క్రమంలోనే శోభిత తన సిస్టర్ ని మొదటిసారి పెళ్లి మండపంలో చూసి ఎమోషనల్ అయ్యి ఏడ్చేశాను అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఈ పెళ్ళికి సంబంధించిన మెహందీ, సంగీత్, హల్దీ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులతో పంచుకుంటుంది.