Chaithu – Sobhita : శోభిత – చైతు ప్రేమ కథకి కారణం ఇన్‌స్టాగ్రామ్.. తమ లవ్ ఎలా మొదలైంది? మొదటిసారి ఎక్కడ కలిశారు?

అసలు చైతు - శోభిత ప్రేమ ఎలా మొదలైంది, వారి పరిచయం ఎలా అని చెప్పుకొచ్చారు.

Sobhita Revealed about Love and first Meeting with Naga Chaitanya

Chaithu – Sobhita : హీరో నాగచైతన్య – హీరోయిన్ శోభిత ఆల్మోస్ట్ రెండేళ్ల ప్రేమ తర్వాత ఇటీవలే హిందూ సాంప్రదాయ పద్దతిలో డిసెంబర్ 4న ఘనంగా వివాహం చేసుకున్నారు. దీంతో ఈ జంట వైరల్ అయింది. పెళ్లి తర్వాత చైతన్య, శోభిత న్యూయార్క్ టైమ్స్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ కొత్త జంట ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలు తెలిపారు.

ఈ క్రమంలో అసలు చైతు – శోభిత ప్రేమ ఎలా మొదలైంది, వారి పరిచయం ఎలా అని చెప్పుకొచ్చారు. మొదట 2018 లోనే నాగార్జునకు సంబంధించిన ఓ ఈవెంట్లో ఈ ఇద్దరు క్యాజువల్ గా యాక్టర్స్ గా మొదటిసారి కలిసారట. అప్పటికి ఇద్దరికీ పరిచయం కూడా లేదు, ఆ తర్వాత కూడా మళ్ళీ కలవలేదు. చైతుకి సమంతతో 2021లో డైవర్స్ అయిన కొన్ని నెలల తర్వాత 2022 ఏప్రిల్ లో శోభిత నాగ చైతన్య పెట్టిన ఓ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీకి రిప్లై ఇచ్చిందట.

Also Read : Chaitanya – Sobhita : చైతు శోభితకు ఎక్కడ పెళ్లి ప్రపోజ్ చేసాడో తెలుసా? ప్రపోజల్ చేసిన కొన్ని రోజులకే నిశ్చితార్థం..

చైతుకి ఓ రెస్టారెంట్ ఉన్న సంగతి తెలిసిందే. దానికి సంబంధించి చైతు ఓ ఫుడ్ గురించి ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా దానికి శోభిత రిప్లై ఇచ్చిందట. శోభిత మంచి ఫుడీ కావడంతో చైతన్య స్టోరీకి రిప్లై ఇవ్వడంతో అలా వారి పరిచయం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మొదలైంది. కొన్నాళ్ళు ఇన్‌స్టాగ్రామ్ లోనే చాటింగ్ చేసుకొని ఆ తర్వాత మాట్లాడుకోవడం, కలవడం మొదలుపెట్టారని తెలిపారు. కొన్నాళ్ళు ఫోన్స్ లోనే మాట్లాడుకున్న ఈ జంట పరిచయం అయిన తర్వాత మొదటిసారి ముంబైలోని ఓ కేఫ్ లో కలిశారు. అప్పుడు శోభిత ముంబైలో ఉండటంతో చైతన్య హైదరాబాద్ నుంచి ఫ్లైట్ లో ముంబైకి వెళ్లి అక్కడ కలిశాడట. ఇక అప్పట్నుంచి వారి ప్రేమ ప్రయాణం మొదలైందని తెలిపారు.