Chaitanya – Sobhita : చైతు శోభితకు పెళ్లి ప్రపోజ్ ఎక్కడ చేసాడో తెలుసా? ప్రపోజల్ చేసిన కొన్ని రోజులకే నిశ్చితార్థం..
చైతు పెళ్లి ప్రపోజల్ గురించి మాట్లాడాడు.

Naga Chaitanya Revealed his Marriage Proposal to Sobhita in A Interview
Chaitanya – Sobhita : నాగచైతన్య – శోభిత ఇటీవల డిసెంబర్ 4న పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి వివాహం, పెళ్లి ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి. పెళ్లి తర్వాత చైతన్య, శోభిత కలిసి న్యూయార్క్ టైమ్స్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో వీరి గురించి బోలెడన్ని ఆసక్తికర విషయాలు తెలిపారు. ఈ క్రమంలో చైతు పెళ్లి ప్రపోజల్ గురించి మాట్లాడాడు.
Also See : Dhanashree Verma : బాబోయ్.. హాట్ ఫోటోలు షేర్ చేసిన క్రికెటర్ యుజ్వేంద్ర చహల్ భార్య ధనశ్రీ వర్మ..
2024 న్యూ ఇయర్ సమయంలో శోభిత చైతన్య కుటుంబాన్ని కలిసిందట. ఆ తర్వాత చైతూ శోభిత కుటుంబాన్ని కలిశాడట. ఆగస్టులో వీరిద్దరూ గోవా ట్రిప్ కి వెళ్ళినప్పుడు అక్కడ చైతన్య శోభితకు పెళ్లి ప్రపోజల్ చేసాడట. అప్పటికే ఇద్దరూ ఒకర్నొకరు అర్ధం చేసుకొని ప్రేమలో ఉండి డేటింగ్ చేస్తుండటంతో శోభిత వెంటనే ఒప్పేసుకుంది. చైతు పెళ్లి ప్రపోజల్ చేసిన కొన్ని రోజులకే ఆగస్టు 8న వీరి నిశ్చితార్థం జరిగింది అని తెలిపారు. గతంలో నాగచైతన్య సమంత డెస్టినేషన్ వివాహం కూడా గోవాలోనే జరగడం గమనార్హం.
View this post on Instagram