Kumari Aunty : ‘కుమారి ఆంటీ’ ఇంకో టీవీ షోలో.. వరుస టీవీ షోలతో బిజీ అయిపోతుందిగా..
కుమారి ఆంటీ ఇంత పాపులర్ అవ్వడంతో టీవీ షోలలోకి వస్తుందని, సినిమా ప్రమోషన్స్ లో వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని అంతా అనుకున్నారు.

Social Media Fame Kumari Aunty Appears in Sridevi Drama Company TV Show
Kumari Aunty : ఇటీవల ఓ రీల్ తో సోషల్ మీడియాలో బాగా పాపులార్ అయిన కుమారి ఆంటీ అందరికి తెలుసు. హైదరాబాద్ లో ఓ ఏరియాలో మీల్స్ అమ్ముకుంటూ జీవితం సాగించే కుమారి ఆంటీ తన వద్ద నాన్ వెజ్ వంటల రేట్స్ తో, కస్టమర్స్ తో ప్రేమగా మాట్లాడే విధానంతో బాగా పాపులార్ అయింది. సోషల్ మీడియా, యూట్యూబ్ వాళ్ళు, సందీప్ కిషన్ తన సినిమా ప్రమోషన్స్ కోసం కుమారి ఆంటీ దగ్గరికి వెళ్లి మరింత ఫేమస్ చేశారు. తర్వాత ఇది పెద్ద ఇష్యూ అవ్వడం, పోలీసులు ఆమెని షాప్ తీసేయమని హెచ్చరించడం, సీఎం రేవంత్ రెడ్డి వరకు వెళ్లి ఇష్యూ క్లియర్ అవ్వడంతో కుమారి ఆంటీ మరింత పాపులర్ అయింది.
ఇక కుమారి ఆంటీ ఇంత పాపులర్ అవ్వడంతో టీవీ షోలలోకి వస్తుందని, సినిమా ప్రమోషన్స్ లో వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని అంతా అనుకున్నారు. అనుకున్నట్టే కుమారి ఆంటీ టీవీ షోలలోకి వచ్చేసింది. ఆల్రెడీ BB ఉత్సవం అనే టీవీ షోలో పాల్గొన్న కుమారి ఆంటీ ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో కూడా వచ్చింది. షోలో తన ఫుడ్ తీసుకొచ్చి అక్కడున్న వారికి వడ్డించింది. హైపర్ ఆది, కుమారి ఆంటీతో సరదాగా కామెడీ చేసాడు. తాజాగా ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని రిలీజ్ చేశారు. దీంతో ఈ ప్రోమో వైరల్ గా మారింది.
Also Read : Actor Nandu : స్టేజిపై ఏడ్చేసిన నందు.. నాకు సంబంధం లేకపోయినా నా గురించి వార్తల్లో అలా..
ఇది చూస్తుంటే కుమారి ఆంటీ మరిన్ని టీవీ షోలలో రావొచ్చు, బిగ్ బాస్ కి కూడా వెళ్లొచ్చు, సినిమాల్లో కూడా కనపడుతుందేమో, బిజినెస్ మరింత పెరిగింది అని కామెంట్స్ చేస్తున్నారు ఆడియన్స్.