Gautam Krishna : బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ కృష్ణ బర్త్ డే సెలబ్రేషన్స్.. ఘనంగా ‘సోలో బాయ్’ మూవీ టీంతో..
ఇటీవల గౌతమ్ కృష్ణ పుట్టిన రోజు వేడుకలను సోలో బాయ్ మూవీ టీంతో ఘనంగా నిర్వహించి ప్రెస్ మీట్ నిర్వహించారు.

Solo Boy Movie Team Celebrated Gautam Krishna Birthday Celebrations
Gautam Krishna : ఇటీవల బిగ్ బాస్ సీజన్ 7లో(Bigg Boss) గౌతమ్ కృష్ణ మెప్పించిన సంగతి తెలిసిందే. గౌతమ్ ఇప్పుడు హీరోగా సోలో బాయ్(Solo Boy) అనే సినిమాతో రాబోతున్నాడు. ఇటీవల గౌతమ్ కృష్ణ పుట్టిన రోజు వేడుకలను సోలో బాయ్ మూవీ టీంతో ఘనంగా నిర్వహించి ప్రెస్ మీట్ నిర్వహించారు. సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సెవెన్ హిల్స్ సతీష్ కుమార్ నిర్మాతగా, నవీన్ కుమార్ దర్శకత్వంలో ఈ సోలో బాయ్ సినిమా తెరకెక్కుతుంది.
Also Read : Varsha Bollamma : మళ్ళీ RCB ఓటమి.. హార్ట్ బ్రేక్ అయింది అంటున్న వర్ష బొల్లమ్మ..
ఈ పుట్టిన రోజు వేడుకలకు హీరో గౌతమ్ కృష్ణ, హీరో ఫాదర్ మనోజ్, నిర్మాత సెవెన్ హిల్స్ సతీష్, డైరెక్టర్ నవీన్ కుమార్, అనిత చౌదరి గారు, కమెడియన్ భద్రం, పింగ్ పాంగ్.. పలువురు పాల్గొన్నారు. ఈ క్రమంలో గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ.. నా పుట్టినరోజుని ఇలా ఒక మూవీ టీం చేయడం చాలా ఆనందంగా ఉంది. నా టీం ఉంది అని చెప్పి డైరెక్టర్ ని తీసుకెళ్తే వెంటనే కథ ఓకే చేసేసారు నిర్మాత. నా ఫస్ట్ సినిమా నుంచి, బిగ్ బాస్ జర్నీ ఆ తర్వాత సపోర్ట్ చేస్తున్న నా అభిమానులకు, అందరికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. త్వరలోనే ఈ సినిమా నుంచి టీజర్, ట్రైలర్, సాంగ్స్ రానున్నాయి అని తెలిపారు.