Telugu Film Chamber: కొంతమంది ఆక్రోశం వారి వ్యక్తిగతమే.. టీఎఫ్‌సీసీ ప్రెసిడెంట్

సాయిధరమ్ తేజ్ రిపబ్లిక్ సినిమా ఈవెంట్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. అటు ఏపీ నుండి వైసీపీ నేతలు, మంత్రులు..

Telugu Film Chamber: కొంతమంది ఆక్రోశం వారి వ్యక్తిగతమే.. టీఎఫ్‌సీసీ ప్రెసిడెంట్

Telugu Film Chamber

Updated On : September 26, 2021 / 8:21 PM IST

Telugu Film Chamber: సాయిధరమ్ తేజ్ రిపబ్లిక్ సినిమా ఈవెంట్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. అటు ఏపీ నుండి వైసీపీ నేతలు, మంత్రులు పవన్ కళ్యాణ్ మీద మాటలతో విరుచుపడుతుంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో కొందరు పవన్ కు మద్దతు తెలుపుతున్నారు. కాగా.. ఈ వివాదంపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ పెద్దలు కూడా స్పందించారు. తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ నారాయణదాస్ నారంగ్ ప్రకటన ద్వారా అభిప్రాయాన్ని ప్రకటించారు. కొంతమంది తమ అభిప్రాయాలను, ఆక్రోశాన్ని వెల్లడించారని.. అయితే అది వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమేనని.. ఫిల్మ్ ఇండస్ట్రీ అభిప్రాయాలుగా వాటిని చూడకూడదన్నారు.

Pawan Kalyan : సినీ ప‌రిశ్ర‌మ‌కు ఇబ్బందులు క‌లిగిస్తే తాట తీస్తా – పవన్ కళ్యాణ్ ఘాటు హెచ్చరిక

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాత్రమే.. రెండు రాష్ట్రాల్లో సినీ ఇండస్ట్రీకి ప్రాతినిధ్యం వహిస్తోంది. ప్రభుత్వాల నుంచి ఎప్పుడూ ఇండస్ట్రీకి సహకారం అందుతూనే ఉంది. ప్రభుత్వాల సహకారం లేకుండా మేం మనుగడ సాగించలేం. ఇండస్ట్రీపై ఆధారపడ్డ వేలాది కుటుంబాలు కరోనా కారణంగా ఇబ్బంది పడుతున్నాయి. ఈ సమయంలో మాకు నేతలు, ప్రభుత్వాల సహకారం ఎంతో అవసరం. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇండస్ట్రీకి రెండు కళ్లు వంటి వారు. సినీ ఇండస్ట్రీకి వారి ఆశీస్సులు, మద్దతును కోరుకుంటున్నామని నారాయణదాస్ కోరారు.

Pawan-Mahesh: పవన్ స్పీచ్.. మహేష్ ట్వీట్ వైరల్!

తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ నారాయణదాస్ నారంగ్ ప్రకటన యధాతదంగా..

మహమ్మారి కరోనా కారణంగా అనేక ఇతర సమస్యల గురించి తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సంప్రదించింది.

గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ మంత్రి శ్రీ పేర్ని నాని ఆహ్వానం మేరకు, తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రతినిధులు సమావేశమై తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై తమ ఆందోళన వ్యక్తం చేశారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ప్రభుత్వానికి ఎంతో కృతజ్ఞతలు తెలుపుతున్నాము. జగన్ మోహన్ రెడ్డి గారు ఓపికగా అర్థం చేసుకోవడం మరియు మా ఆందోళనలన్నింటికీ సానుకూలంగా స్పందించడం అలాగే సమీప భవిష్యత్తులో మా ఆందోళనలన్నీ అనుకూలంగా పరిష్కరించబడతాయని హామీ ఇచ్చినందుకు ముందుగా కృతజ్ఞతలు.

మన తెలుగు రాష్ట్రాలను కరోనా మహమ్మారి కారణంగా ఇతర సమస్యల రాష్ట్ర విభజన తాకిడికి గురైన పరిశ్రమలో ప్రస్తుత పరిస్థితి కారణంగా, మా పరిశ్రమ అత్యంత దయనీయ మైన పరిస్థితిలో ఉంది. వివిధ వ్యక్తులు తమ అభిప్రాయాలను మరియు ఆవేదనను వివిధ వేదికలపై వ్యక్తం చేశారు. ఇది పరిశ్రమ యొక్క అభిప్రాయం కాదు. మా పరిశ్రమ యొక్క అపెక్స్ బాడీ రెండు తెలుగు రాష్ట్రాలలోని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని పునరుద్ఘాటించాలనుకుంటున్నాము. సంవత్సరాలుగా మాకు ప్రభుత్వాలు ఎల్లప్పుడూ మద్దతు ఇస్తున్నాయి. వారి మద్దతు లేకుండా చిత్ర పరిశ్రమ మనుగడ సాగించలేము.

ఈ పరిశ్రమపై ఆధారపడిన వేలాది మంది ప్రజలు మరియు వారి కుటుంబాలు మార్చి 2020 నుండి బాధపడుతున్నారు. ఈ తరుణంలో మన నాయకులు మరియు ప్రభుత్వాలు పెద్ద మనసుతో వారి నిరంతర మద్దతును అందించడానికి చిత్ర పరిశ్రమకు మద్దతు అవసరం.

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలు మన చలనచిత్ర పరిశ్రమకు రెండు కళ్ళు మరియు మా గౌరవనీయ ముఖ్యమంత్రులు ఇద్దరూ చురుగ్గా ఉన్నారు మరియు వారి ప్రోత్సాహం మరియు మద్దతు ఎల్లప్పుడూ మాకు అందించారు. వారి నిరంతర దీవెనలు మరియు మద్దతు కోరుతూ….

నారాయణ దాస్ నారంగ్
అధ్యక్షులు