హైదరాబాద్‌లో ‘సన్ ఆఫ్ ఇండియా’..
Son of India: కలెక్షన్ కింగ్ డాక్టర్ మోహన్ బాబు హీరోగా నటిస్తున్న చిత్రం ‘సన్ ఆఫ్ ఇండియా’. శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నారు.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన ‘సన్ ఆఫ్ ఇండియా’ టైటిల్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. బుధవారం నుండి హైదరాబాద్‌లో సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ అయింది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నట్లు చిత్రబృందం సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.ఇదివరకెన్నడూ కనిపించని అత్యంత పవర్ఫుల్ రోల్లో మోహన్ బాబు నటిస్తున్న ఈ తరహా కథ కానీ, ఈ జానర్ సినిమా కానీ ఇప్పటివరకూ టాలీవుడ్లో రాలేదని, దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కథ, కథనాలతో పాటు మోహన్ బాబు నటన హైలెట్‌గా ఉంటుందని మూవీ టీమ్ తెలిపింది.
మేస్ట్రో ఇళయరాజా సంగీతమందిస్తోన్న ఈ చిత్రానికి సర్వేష్ మురారి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. డాక్టర్ మోహన్‌బాబు స్వయంగా స్క్రీన్‌ప్లే సమకూరుస్తున్న ఈ సినిమాకు డైమండ్ రత్నబాబు, తోటపల్లి సాయినాథ్ సంభాషణలు రాస్తున్నారు.
https://10tv.in/ameesha-patel-instagram-pics-viral/
సుద్దాల అశోక్ తేజ పాటలు రాస్తుండగా, గౌతంరాజు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మోహన్‌బాబుకు స్టైలిస్ట్‌గా విరానికా మంచు వ్యవహరిస్తుండటం విశేషం.