Sonakshi Sinha: చిరు కోసం బాలీవుడ్ నుండి ఈ ఇద్దరూ!
ఎన్టీఆర్ జై లవకుశతో స్టార్ హీరోలను హ్యాండిల్ చేయగలడని నిరోపించుకున్న బాబీ మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాపై చాలా రోజులుగా రకరకాల చర్చలు జరుగుతుండగా.. మైత్రిమూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనుంది.
- Naresh Mannam
- Published On : June 24, 2021 / 11:32 AM IST
Sonakshi Sinha And Nawazuddin Siddiqui From Bollywood For Chiru
Sonakshi Sinha: ఎన్టీఆర్ జై లవకుశతో స్టార్ హీరోలను హ్యాండిల్ చేయగలడని నిరోపించుకున్న బాబీ మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాపై చాలా రోజులుగా రకరకాల చర్చలు జరుగుతుండగా.. మైత్రిమూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనుంది. కాగా.. ఈ సినిమా కోసం బాలీవుడ్ నుండి ఇద్దరిని రప్పిస్తున్నారని ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ అఫ్ ది టాక్ గా మారింది. ఆ ఇద్దరే సోనాక్షి సిన్హా.. నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ.
బాలీవుడ్ బొద్దుగుమ్మ సోనాక్షి ఇప్పటికే దక్షణాదిన సూపర్ స్టార్ రజనీ సరసన లింగా సినిమాలో నటించగా ఆ తర్వాత మరే దక్షణాది సినిమా ఒకే చేయలేదు. అయితే.. ఏడేళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ మెగాస్టార్ కోసం మరోసారి సోనాక్షిని ఒప్పించినట్లు తెలుస్తుంది. ఇక నవాజుద్దీన్ కూడా రజనీ పెటా సినిమాతో సౌత్ ఇండస్ట్రీలో అడుగుపెట్టగా ఇప్పుడు చిరు సినిమాతో తెలుగులో అరంగేట్రం కానున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ ఇద్దరు ఫైనల్ అయినట్లుగా తెలుస్తుంది.
కాగా, చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తుండగా ఆ తర్వాత లూసిఫర్ రీమేక్ తో పాటు మెహర్ రమేష్ దర్శకత్వంలో మరో సినిమా చేయాల్సి ఉంది. మరి బాబీ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకి వెళ్తుందో తెలియదు కానీ హీరోయిన్ గా సోనాక్షి, ప్రతికథానాయకుడిగా సిద్దికీ దిగుమతి వార్తతో ఇప్పుడు ఈ సినిమా గురించే ఇండస్ట్రీలో చర్చ జరుగుతుంది.
