Allu Arjun: అల్లు అర్జున్ బర్త్డే స్పెషల్.. ఐకాన్ స్టార్ ను కలిసి విష్ చేసిన క్రిటిక్స్ అసోసియేషన్ సభ్యులు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) బర్త్ డే సందర్భంగా "ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్" సభ్యులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
Film Critics Association Members met Allu Arjun and extended their wishes.
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు వేడుకలు సినీ పరిశ్రమలో సందడిగా సాగుతున్నాయి. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని “ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్” సభ్యులు బన్నీని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన కెరీర్లో మైలురాయిగా నిలవనున్న ‘రాకా’ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ అత్యంత వైవిధ్యంగా ఉందని, అది ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటుందని ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు ప్రశంసించారు.
అల్లు అర్జున్(Allu Arjun) ను కలిసిన వారిలో ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు ప్రభు, అధ్యక్షులు బత్తుల ప్రసాద్, ప్రధాన కార్యదర్శి సురేష్ కొండేటి, కోశాధికారి భరద్వాజ మరియు ఉపాధ్యక్షులు జనార్దన్ ఉన్నారు. వీరితో పాటు జాయింట్ సెక్రటరీ శ్యామ్ రావుట్ల, కార్యవర్గ సభ్యులు ధీరజ అప్పాజీ, కుమార్ తదితరులు పాల్గొని బన్నీకి పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు. సభ్యులందరితో ఎంతో ఆప్యాయంగా మాట్లాడిన ఐకాన్ స్టార్, వారి పలకరింపుకు కృతజ్ఞతలు తెలుపుతూ సంతోషం వ్యక్తం చేశారు.
అసోసియేషన్ సభ్యులందరినీ ఉద్దేశించి అల్లు అర్జున్ ఒక కీలక వ్యాఖ్య చేశారు. ప్రస్తుతం తన షూటింగ్ షెడ్యూల్స్, ఇతర పనుల వల్ల బిజీగా ఉన్నప్పటికీ, త్వరలోనే మీ అందరినీ ప్రత్యేకంగా కలిసి మాట్లాడతానని హామీ ఇచ్చారు.అల్లు అర్జున్ పుట్టినరోజు నాడు జరిగిన ఈ భేటీకి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతూ అభిమానులను అలరిస్తున్నాయి.
