Race Gurram: ఓరి మీ దుంపలు తెగ.. థియేటర్స్ లోకి నిజమైన గుర్రాలు తీసుకొచ్చారుగా.. ‘రేసు గుర్రం’ రీ రిలీజ్ లో కొత్త ట్రెండ్
రేస్ గుర్రం(Race Gurram) రీ రిలీస్ థియేటర్స్ లో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్.
Fans Bring Real Horses to Race Gurram re release theaters
- ట్రెండ్ సెట్ చేసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్
- ‘రేసు గుర్రం’ రీ రిలీజ్ థియేటర్స్ లోకి నిజమైన గుర్రాలు
- వైరల్ అవుతున్న వీడియోలు
Race Gurram: టాలీవుడ్ స్టార్ హీరోల పుట్టినరోజు వేడుకలు కేవలం కేక్ కటింగ్స్, బ్యానర్లకే పరిమితం అవడం లేదు. వారి కెరీర్ ఓ బెస్ట్ సినిమాలను రీ-రిలీజ్ చేసే ట్రెండ్ కొనసాగుతోంది. థియేటర్లలో పాత సినిమాలను విడుదల చేస్తూ అభిమానులు సరికొత్త పండగ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. కేవలం సినిమా చూడటమే కాకుండా, అందులోని ఐకానిక్ సీన్లను, సినిమా టైటిల్‌ను రీక్రియెట్ చేస్తూ వినూత్నంగా సెలబ్రేట్ చేసుకోవడం ఇప్పుడు ట్రెండ్ గా మారింది.
NtrNeel: ఆగిపోయిన ఎన్టీఆర్ ‘డ్రాగన్’ సినిమా షూటింగ్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కెరీర్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిన ‘రేస్ గుర్రం(Race Gurram)’ సినిమాను మేకర్స్ థియేటర్లలోకి మళ్ళీ తీసుకువచ్చారు. బన్నీ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్, శృతి హాసన్ నటన, బ్రహ్మానందం కామెడీతో అలరించిన ఈ చిత్రం రీ-రిలీజ్లోనూ భారీ స్పందన పొందింది. అయితే ఈసారి అభిమానులు చూపించిన ఉత్సాహం అందరినీ ఆశ్చర్యపరిచింది. సినిమా టైటిల్‌కు తగ్గట్లుగా థియేటర్ల లోపలి ఏకంగా నిజమైన గుర్రాలను తీసుకువచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. థియేటర్ బయట గుర్రాలపై స్వారీ చేస్తూ, అల్లు అర్జున్ పాటలకు డ్యాన్స్ చేస్తూ ఫ్యాన్స్ చేసిన సందడి మామూలుగా లేదు. సినిమా థియేటర్ వద్దకు గుర్రాలను తీసుకురావడం అనే ఐడియా వెరైటీగా ఉన్నప్పటికీ, కొందరు నెటిజన్లు మాత్రం ఆశ్చర్యపోతున్నారు. ఏది ఏమైనా, తన క్రేజ్‌తో బాక్సాఫీస్ వద్ద రేసు గుర్రంలా దూసుకుపోయే అల్లు అర్జున్ కోసం అభిమానులు చేసిన ఈ హడావిడి ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది.
రేసు గుర్రం సినిమా రీ రిలీజ్ సందర్భంగా థియేటర్ లోకి గుర్రాలను తీసుకొచ్చిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ pic.twitter.com/yx5eDT7oOf
— Telugu Scribe (@TeluguScribe) April 8, 2026
