Sonal Chauhan : ప్రభాస్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన బాలయ్య హీరోయిన్.. వరుస తెలుగు సినిమాలతో బిజిబిజీ..

సోనాల్ మళ్ళీ తెలుగు సినిమాలతో బిజీ అవుతుంది. ఇప్పటికే 'ఎఫ్3' సినిమాలో సోనాల్ ఓ అతిధి పాత్ర చేయనుంది. ఇక నాగార్జున హీరోగా చేస్తున్న 'ఘోస్ట్' సినిమాలో కూడా సోనాల్ హీరోయిన్ గా........

Sonal Chauhan : ప్రభాస్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన బాలయ్య హీరోయిన్.. వరుస తెలుగు సినిమాలతో బిజిబిజీ..

Sonal

Updated On : April 13, 2022 / 3:25 PM IST

Sonal Chauhan :  బాలీవుడ్ హీరోయిన్ సోనాల్ చౌహాన్ హిందీలో సినిమాలు చేస్తూ తెలుగులో కూడా నటించింది. తెలుగులో బాలయ్య బాబు సరసన లెజెండ్, డిక్టేటర్, రూలర్ ఇలా మూడు సినిమాల్లో నటించింది. ఇటీవల సోనాల్ మళ్ళీ తెలుగు సినిమాలతో బిజీ అవుతుంది. ఇప్పటికే ‘ఎఫ్3’ సినిమాలో సోనాల్ ఓ అతిధి పాత్ర చేయనుంది. ఇక నాగార్జున హీరోగా చేస్తున్న ‘ఘోస్ట్’ సినిమాలో కూడా సోనాల్ హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా మరో క్రేజీ ప్రాజెక్టులో ఆఫర్ దక్కించుకుంది సోనాల్.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ లో ‘ఆదిపురుష్’ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా హిందీతో పాటు అన్ని భాషల్లోనూ రిలీజ్ అవుతుంది. ప్రభాస్ ఎక్కడికి వెళ్లినా మన తెలుగు హీరోనే. తాజాగా సోనాల్ ప్రభాస్ పక్కన ఆదిపురుష్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిందని సమాచారం. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సోనాల్ మాట్లాడుతూ ఈ విషయం తెలిపింది. సోనాల్ మాట్లాడుతూ.. ”నేను ఇప్పటిదాకా నటించిన సినిమాలతో చూస్తే ఆదిపురుష్ స్పెషల్ సినిమా. ఈ సెట్ లో మరో ప్రపంచాన్ని చూశాను. నా తొలి పౌరాణిక సినిమా ఇది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఆదిపురుష్ సినిమా మీకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది” అని తెలిపింది.

 

Jersey : హిందీ జెర్సీకి దెబ్బ మీద దెబ్బ.. అసహనం వ్యక్తం చేస్తున్న షాహిద్ కపూర్..

ఇలా 34 ఏళ్ళ ఈ భామ సీనియర్ హీరోల సరసన వరుస సినిమాలు చేస్తూ ఎలాంటి ఆఫర్ వచ్చినా వదులుకోకుండా చేస్తుంది. మరి ఇప్పటికే మూడు సినిమాలు చేతిలో ఉన్న సోనాల్ భవిష్యత్తులో ఇంకెన్ని తెలుగు సినిమాలతో మెప్పిస్తుందో చూడాలి. ఇలా వరుస సినిమాలతో పాటు తన సోషల్ మీడియాలో బోల్డ్ ఫొటోలతో రచ్చ చేస్తుంది సోనాల్.